మోకాళ్ల నొప్పి వచ్చినప్పుడు పొరపాటున కూడా ఈ తప్పు చేయవద్దు. చేస్తే జీవితంలో కోలుకోలేరు.
సాధారణంగా ఎముకల్లో గట్టిదనం లేకపోవడం మరియు కీళ్లు బలహీనంగా మారడం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. ఈ సమస్య పురుషుల కంటే మహిళ్లల్లోనే ఎక్కువ. మోకాళ్ల నొప్పులు ఉన్నవారిలో మొదట కీళ్లలో వాపు, మోకాలు ఎర్రబడటం, ఆ తరువాత భరించలేని నొప్పి మోకాలు మొత్తం వ్యాపిస్తుంది. ఈ ప్రక్రియ సుమారు 2-5 సంవత్సరాల కాలంలో జరుగుతుంది. అయితే ఈ రోజుల్లో మోకాళ్ల, కీళ్ల నొప్పులను చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆర్థరైటిస్ చికిత్సలో ఆలస్యం వెన్నెముకకు హాని కలిగిస్తుందనే విషయం చాలామందికి తెలియదు.
ఆర్థరైటిస్ అనేది ఎముకలకు చాలా నష్టం కలిగించే వ్యాధి. కొంతమంది మధ్య వయస్కులు, వృద్ధులు మోకాళ్లలో తీవ్రమైన నొప్పిని కలిగి ఉంటారు. దీనికి సరైన మందులు అవసరం కానీ ప్రజలు తరచుగా చికిత్సను ఆలస్యం చేస్తారు. బదులుగా హోం రెమెడీస్, ఆయిల్ మసాజ్‌కి ప్రాధాన్యత ఇస్తారు. చికిత్స ఆలస్యం అయితే అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. చికిత్సలో ఆలస్యం ఎందుకు ప్రమాదకరం? ఆర్థరైటిస్ చికిత్సను ఆలస్యం చేస్తే అది మోకాళ్లతో పాటు వెన్నుపాముకు హాని కలిగిస్తుంది.
చాలా మంది వైద్యులు తమ వద్దకు వచ్చే మోకాళ్ల ఆస్టియో ఆర్థరైటిస్ రోగుల్లో 70 శాతం మంది చివరి దశలో వస్తున్నారని తేలింది. అప్పటికి మోకాళ్లు చాలా వరకు దెబ్బతింటున్నాయని వైద్యులు చెబుతున్నారు. మోకాలి చికిత్స ఎంపికలపై అవగాహన లేకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతోంది. మోకాలి, కీళ్ల నొప్పులకు చాలా మంది అనాల్జెసిక్స్ లేదా నొప్పిని తగ్గించే బామ్‌లను ఉపయోగించి తక్షణ ఉపశమనం పొందుతున్నారు.
ఇటువంటి తాత్కాలిక పరిష్కారాలు ఎముక, కీళ్ల పరిస్థితులను మరింత దిగజార్చతున్నాయి. ఇవి కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స చేయడం వల్ల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. చాలామంది మోకాలి చికిత్సను ఆలస్యం చేసి చివరి దశకు తీసుకువెళుతున్నారు. దీని కారణంగా వారి వెన్నుపాము తీవ్రంగా దెబ్బతింటోంది. కీళ్ల నొప్పులను ఇతర మార్గాల ద్వారా నయం చేయలేనప్పుడు అది వారి జీవితంపై నెగిటివ్ ప్రభావం చూపుతుంది.
ఈ పరిస్థితిలో శస్త్రచికిత్స అవసరం అని అర్థం చేసుకోవాలి. ప్రారంభ లక్షణాల గురించి చెప్పాలంటే మోకాలి కీళ్ళనొప్పులు మీరు కూర్చున్న తర్వాత లేదా మెట్లు ఎక్కేటప్పుడు, లేచి నిలబడినప్పుడు సాధారణ నొప్పి లేదా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చివరి దశలో నొప్పి అన్ని సమయాలలో ముఖ్యంగా రాత్రి సమయంలో తీవ్రంగా ఉంటుంది.