Health

చెవిలో గులిమిని క్లీన్ చేయకపోతే.. ఏం జరుగుతుందో తెలుసుకోండి.

గులిమి చెవి లోపలి గ్రంథుల్లో ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. చెవులను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. చెవుల్లో ఉన్న నాళాలు ఎండిపోకుండా, పగుళ్లు రాకుండా కాపాడుతుంది. ధూళికణాలు, నీరు చెవిలోపలికి పోకుండా రక్షిస్తుంది. ఎలాంటి వ్యాధులూ సోకకుండా అరికడుతుంది. అయితే చెవిలో గులిమి.. కర్ణభేరి దగ్గరికి వ్యర్ధపదార్థాలు వెళ్లకుండా దుమ్ము ధూళి వెళ్ళకుండా పురుగులు వంటివి చొరబడకుండా అడ్డుకుంటాయి తద్వారా మన వినికిడి శక్తి దెబ్బతినకుండా ఉంటుంది.

ఒకవేళ చెవిలో గులిమిని ఎక్కువగా తొలగించినట్లయితే చెవిలోపల బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందని కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చెవిలో గులిమి ఉండటం వల్ల మేలు జరుగుతుందని, చెవిలో గులిమి ప్రమాదకరం అనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని ఈఎన్టీ నిపుణులు తెలుపుతున్నారు. అయితే చెవిలో గులిమి ఒక్కోసారి ఎక్కువగా పేరుకుపోయినప్పుడు వినికిడి లోపం కూడా వచ్చే అవకాశం ఉందని, అలాంటి సమయంలో గులిమిని తొలగించేందుకు వైద్య నిపుణుల సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

కానీ కొంతమంది తమ సొంత వైద్యంతో చెవిలో గులిమిని తొలగించాలని ప్రయత్నం చేస్తుంటారు కానీ అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చెవిలో గొలిమిని తొలగించుకునేందుకు కొందరు వెల్లుల్లిపాయను చెవిలో పెట్టుకుంటారు అయితే ఇలా చేయడం చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి చెవిలో గులిమి అనేది కొందరికి గట్టిగా జిగురులాంటి పదార్థం లాగా ఏర్పడుతుందని మరికొందరికి పొడి రూపంలో ఏర్పడుతుందని సూచిస్తున్నారు. అయితే దీనికి కారణం వంశపారంపర్యంగా వచ్చే లక్షణమని తెలుపుతున్నారు.

దీనిపై పలు పరిశోధనలు సైతం జరిగాయి ఆఫ్రికన్, యూరోపియన్ ప్రజల్లో చెవిలో గులిమి జిగురులా ఏర్పడుతుందని, అదే తూర్పు ఆసియా దేశాల్లో ప్రజలకు చెవిలో కొలిమి పొడి రూపంలో ఏర్పడుతుందని పరిశోధనలు తేల్చాయి. చెవిలో గులిమిని తొలగించుకునేందుకు సురక్షితమైన పద్ధతి:- సాధారణంగా చెవిలో గులిమిని తొలగించే ప్రక్రియ సహజంగానే మన చెవి లోపల ఉన్న నిర్మాణమే చూసుకుంటుంది. చెవిలో గులిమి పేరుకోగానే ఉండలుగా మారి అది బయటకు వచ్చేస్తుంది. అందుకే చెవిలోపల గులిమిని తొలగించుకునేందుకు వీలైనంత వరకూ మానవ ప్రయత్నానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

చెవిలో గులిమిని శుభ్రం చేయడానికి, బయటకు వచ్చిన మైనం తొలగించడం కోసం చెవి బయట భాగంలో కాటన్ లేదా తడి వాష్‌క్లాత్‌ ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇయర్ కెనాల్ లోకి ఏది చొప్పించవద్దని సూచిస్తున్నారు. అయితే చెవి లోపల నొప్పి, తల తిరగడం, వినికిడి లోపం ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, చెవిలో గులిమి తీసే ప్రయత్నం చేయవద్దని, అలా చేస్తే మరింత దెబ్బ తినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker