రోజు ఒక పచ్చి మామిడి ముక్క ఒకటి తింటే.. ఇన్ని అనారోగ్య సమస్యలు తగ్గుతాయా.. ?
మామిడి పండ్లే కాదు పచ్చి మామిడి కాయలు తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులోనూ గర్భిణులు పచ్చి మామిడి కాయలను ఇష్టంగా తింటుంటారు. పచ్చిమామిడి కాయలను ముక్కలుగా కోసి వాటిపై కాస్త ఉప్పు, కారం వేసుకుని తింటుంటే వచ్చే ఆ మజాను మాటల్లో చెప్పలేం కదా. ఇకపోతే పచ్చి మామిడికాయలో విటమిన్లు అధిక మొత్తంలో ఉంటాయి.
ఇందులో కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. వేసవిలో పచ్చి మామిడిని తినడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అలాగే వడదెబ్బ తగలకుండా మనల్ని కాపాడుతుంది. ఇక ఎండాకాలంలో వచ్చే ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.
అయితే పచ్చిమామిడిని తీసుకుంటే జీర్ణ ఎంజైమ్స్ స్రవించడానికి పేగులని ప్రేరేపిస్తుంది దీన్ని తీసుకుంటే ఎసిడిటీ, మలబద్ధకం, మార్నింగ్ సిక్నెస్, అజీర్తి,జీవన సమస్యలు వంటివి ఉండవు. ఇలాంటి సమస్యలు అన్నీ కూడా పచ్చి మామిడి తో తొలగిపోతాయి పచ్చిమామిడికి తింటే వడదబ్బ నుండి కూడా మనకి రక్షణ కలుగుతుంది. హైడ్రేట్ కూడా అవుతుంది. పచ్చిమామిడి లో విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.
రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. తెల్ల రక్త కణాలు పెరిగి వ్యాధులతో పోరాడే బలం వస్తుంది. చిగుళ్ల సమస్యలు కూడా ఉండవు గుండెకి కూడా చాలా మేలు కలిగిస్తుంది పచ్చి మామిడి. పచ్చి మామిడి ని తీసుకోవడం వలన ఫ్యాటీ యాసిడ్స్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి గుండె జబ్బులు ముప్పు తగ్గుతుంది.
పొటాషియం, మెగ్నీషియం వంటివి కూడా అందుతాయి. చర్మానికి జుట్టుకి కూడా మేలు కలుగుతుంది. ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి పచ్చి మామిడి ని తీసుకోవడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పోషక పదార్థాలు అందుతాయి తప్ప నష్టాలు ఏమి వుండవు.