Health

మహిళల్లో ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ని కలవండి. లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది.

ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించడంకోసం ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రవేశపెట్టబడింది. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే రెఫర్‌ చేయడంద్వారా పెద్దాసుపత్రుల్లో వారికి సాయం చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌ డెస్‌లు అందుబాటులో ఉంటాయి. అయితే క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి. ఎందుకంటే ఇది చాలా ఆలస్యంగా గుర్తించబడుతుంది.

దీంతో రోగికి సకాలంలో చికిత్స లభించదు. ఈ ఆలస్యం వల్ల రోగి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. మహిళల్లో వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. బ్లడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. అయితే ఓవర్ వెయిట్ లాస్ అవ్వడం:- ఏదైనా క్యాన్సర్ కు ఇది మొదటి లక్షణం కావచ్చు. అసలు ఏ కారణం లేకుండా ఓవర్ గా బరువు తగ్గితే మాత్రం ఇది ప్రమాదమని భావించండి.

చాలా మందికి ఈ లక్షణం ద్వారా మాత్రమే క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయకండి. రొమ్ము కణజాలంలో మార్పులు:-మహిళలకు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రొమ్ములో ఏదైనా ముద్ద లేదా మందంగా, ఆకారంలో మార్పులు గమనించినట్లయితే వెంటనే చికిత్స తీసుకోవాలి. యోని ఉత్సర్గ: – పీరియడ్స్.. పీరియడ్స్ కి మధ్య ఉత్సర్గ సాధారణమైనది కాదు. అదే సమయంలో మీరు అకస్మాత్తుగా భారీగా రక్త స్రావం కలిగి ఉంటే.. ఇది కూడా క్యాన్సర్ కు ఒక లక్షణంగా భావించవచ్చు.

ఇలా అధికంగా రక్త స్రావం అయితే మాత్రం వైద్యుడిని సంప్రదించడం మేలు. పెల్విక్ ప్రాంతంలో నొప్పి:- మీరు పెల్విక్ ప్రాంతంలో నిరంతరం నొప్పి లేదా ఒత్తిడిని అనుభవిస్తూ ఉంటే అది అండాశయ క్యాన్సర్ లేదా గర్భాశయ క్యాన్సర్ కు కారణం కావచ్చు. ఇది కాకుండా మీ పెల్విక్ ప్రాంతానికి చేరిన మరి కొన్ని క్యాన్సర్ లకు కూడా కారణం కావచ్చు. చర్మంలో మార్పలు లేదా కంటిన్యూగా అలసట:- పింపుల్స్ ఆకారంలో లేదా ముఖ రూపులో కూడా మార్పులు ఏమైనా ఉంటే అది చర్మ క్యాన్సర్ కు కారణం కావచ్చు.

అంతే కాకుండా ఎప్పుడూ అలిపి పోయినట్టు ఉండటం లేదా నీరసంగా ఉండటం కూడా మంచి సంకేతం కాదు. చాలా మంది మహిళలు విస్మరించే చిన్న చిన్న మార్పులు ఇవి అయి ఉండొచ్చు. ఇలా ముందుగానే మీ శరీరంలో కొన్ని రకాల మార్పులను గమనించి.. వెంటనే చికిత్స తీసుకుంటే క్యాన్సర్ ను ముందే కని పెట్టవచ్చు. లేదంటే ఇది పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker