ఈ పౌడర్ కొంచం తింటే చాలు, మీ పేగుల్లో పేరుకుపోయిన మలాన్ని బయటకు పంపుతుంది.
మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రేగుల ప్రక్షాళన చాలా అవసరం. అంతే కాదు కోలన్ క్లెన్సింగ్ వల్ల కోలన్ క్యాన్సర్ బారీన పడకుండా ఉంటారు. మనం తీసుకొనే ఆహారాల్లో ప్లీతోర అనే కంటెంట్ వల్ల ప్రేగులు ప్రక్షాళన కావింపబడి , మరింత ఉత్తమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అయితే మనం తినే ఆహారంలో ఫైబర్ అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల.. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.
కడుపులో నొప్పి, మల బద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు ఉండవు. పొట్ట, ప్రేగులు కూడా క్లీన్ అవుతాయి. అయితే కొంత మంది బరువు తగ్గాలని లేదా ఇతర కారణాల వల్ల ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల ఫైబర్ అనేది తక్కువ అవుతుంది. ఇలా ఫైబర్ ని తక్కువగా తీసుకోవడం వల్ల మల బద్ధకం సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి:- పీచు పదార్థం తక్కువగా తీసుకోవడం వల్ల పొట్టలో వ్యర్థం తక్కువగా తయారవుతుంది. ఈ మలం తక్కువగా తయారవ్వడం వల్ల దానికి తగినంత ప్రెషర్ లభించక.. బయటకు రాదు. దీంతో మల బద్ధకం సమస్య తలెత్తుతుంది. దీంతో వచ్చే మలం కూడా గట్టిగా వస్తుంది. అంతే కాకుండా నొప్పిగా కూడా ఉంటుంది. ఇలా ప్రేగుల్లో మలం పేరుకుంటే.. దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాకుండా పలు ఇన్ ఫెక్షన్లకు కూడా గురవుతారు.
ఆహారం తక్కువగా తీసుకున్నవారు మల బద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం ఉదయాన్నే నీటిని ఎక్కువగా తీసుకోవాలి. అందుకే కనీసం మీరు తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పనస పండ్ల పొడి బాగా హెల్ప్ చేస్తుంది:- అలాగే ఉదయాన్నే నీటిని ఎక్కువగా తాగడం వల్ల ప్రేగుల్లోని మలం సులభంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఉదయాన్నే నీటిని తాగిన తర్వాత కడుపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా..
ప్రేగులు క్లీన్ గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా పనస పండ్ల పొడిని తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండ్ల పొడిని తీసుకోవడం వల్ల మల బద్ధకం సమస్య తలెత్తకుండా ఉంటుంది. దానితో పాటు కడుపులో ఎలాంటి మలినాలు ఉన్నా దెబ్బకు బయటకు వచ్చేస్తాయి. ఈ పనస పండ్ల పొడిని కూరల్లో కూడా వేసుకుని తినవచ్చు. దీని వల్ల ప్రేగుల్లో ఎలాంటి మలం పేరుకు పోకుండా, ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.