Health

దెయ్యాల సినిమాలు చూడటం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకోండి.

దెయ్యాలంటే భయం ఉంటుంది కానీ ఆ సినిమాల మీద ఇష్టం మాత్రం తగ్గదు. భయపడుతూనే చూస్తారు. భాషతో సంబంధం లేకుండా.. టైమ్‌ దొరికితే చాలు.. హర్రర్‌ మూవీస్‌ను చూస్తారు. మీకు అలాంటి అలవాటు ఉంటే.. ఈ విషయం మీకే.. రీసెంట్‌గా జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. హారర్ సినిమాలు చూడటం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయని తేలింది.

శరీర బరువును సులభంగా తగ్గించుకోవచ్చట. అయితే చాలామంది కేలరీలు తగ్గించుకోవాలని తెగ తాపత్రయపడుతుంటారు. అయితే 90 నిముషాల హారర్ సినిమా చూస్తే ఎటువంటి శారీరక శ్రమ లేకుండా కేలరీలు బర్న్ అవుతాయట. దాదాపుగా 200 కేలరీలు బర్న్ చేయవచ్చునట. ఇక సినిమా చూస్తున్నంత సేపు భయపడేవారిని చూస్తుంటాం. కానీ ఆ తరువాత వారిలో ఆందోళన, నిరాశ తగ్గిపోతాయట.

చాలా సంతోషంగా కనిపిస్తారట. మానసిక స్థితిని మెరుగుపరచడంలో హారర్ సినిమాలు ఎంతగానో ఉపయోగపడతాయట. హారర్ సినిమా చూస్తున్నంత సేపు రక్తంలో తెల్ల రక్త కణాలు పెరుగుతాయట. ఇది తక్కువ టైంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చాలామంది ఒత్తిడితో ఉంటారు. అలాంటి వారు హారర్ సినిమాలు చూడటం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారట. హారర్ సినిమా చూస్తున్నప్పుడు న్యూరోట్రాన్స్‌మీటర్లు విడుదలవుతాయి.

ఇవి బ్రెయిన్ పనితీరును మెరుపరుస్తాయట. హారర్ సినిమాలు చూసేవారు జీవితంలో దేనికీ భయపడరట. దేన్నైనా ఎదుర్కొనగలిగే ధైర్యం వస్తుందట.ఇక పట్టుదల నేర్పుతాయట. ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో అయినా ధైర్యంగా ఉండేలా హారర్ సినిమాలు ప్రేరేపిస్తాయట. జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి.

వాటికి కొందరు విపరీతంగా భయపడిపోతుంటారు. హారర్ సినిమాలు జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారా మార్గాలు చూపిస్తాయట. సమస్యకు సొల్యూషన్ కనుగొనేలా చేస్తాయట. ఇవి హారర్ సినిమాలు చూడటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలట.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker