తినేటప్పుడు మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా..! మీ పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోండి.
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. ఇక పసి పిల్లలకు అయితే వ్యసనంగా మారుతోంది. ఫోన్ చూపిస్తేనే అన్నం తింటున్నారు. అయితే రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో 90 శాతం మంది సెల్ ఫోన్ చూస్తూ ఆహారం తింటున్నారని అధ్యయనంలో తేలింది. పిల్లలు కడుపు నిండా తింటున్నారని.. అనుకుంటున్నారని కానీ దీంతో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనే విషయం మాత్రం ఆలోచించడం లేదు.
ఇదే పద్దతి క్రమంగా పిల్లలపై మానసిక, శారీరక ఆరోగ్యం ప్రభావం చూపుతోంది. అయితే ఇది మొదటగా బాగానే ఉన్నా క్రమంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయని సైకాలజిస్ట్ హెచ్చరిస్తున్నారు. ఉబకాయం.. పిల్లలు వీడియో గేమ్స్,వెబ్ సిరీస్,యూట్యూబ్,టీవీ చూసుకుంటూ, అక్కడే ఒకే చోట కదల కుండా కూర్చొని ఉంటారు.దానివల్ల శారీరక శ్రమ లేక,అధిక బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి పిల్లలు ఉబకాయం వచ్చి,అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటూ ఉంటారు.
కంటిసమస్యలు.. ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువ గా చూడడం వల్ల,కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే జబ్బు రావడం కాయం.మరియు కంటి చూపు తగ్గడం, కళ్ళు పొడిబారడం వంటి సమస్యలు ఏర్పడతాయి. మానసిక సమస్యలు..ఫోన్ లో వీడియోలు చూసుకుంటూ, అనుబంధాలకి తావివ్వకుండా, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. మరియు వారిలో కరుణ జాలి దయ అనే అంశాలు క్రమంగా తగ్గుతూ వస్తాయి.
కావున పెద్దలేవి వారికి అవగాహన కలిగించి బంధాల గురించి తెలియజేస్తూ ఉండాలి. నిద్రలేమి..ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ నుంచి వచ్చే నీలి కిరణాలు కళ్ళపై పడటం వల్ల, శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల రాత్రి సమయంలో సరిగా నిద్ర పట్టక నిద్రలేమి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.కావున ఫోన్, కంప్యూటర్, లాప్ టాప్ వంటివి నిద్రకు గంట ముందే వాడకుండా ఉండడం మంచిది.
జీర్ణ సమస్యలు..ఫోన్ చూస్తూ భోజనం చేయడం ద్వారా, మెదడు సంకేతాలను పంపలేదు.దానితో ఏమి తింటున్నారో , ఎంత తింటున్నారో ఏమీ తెలియకుండా తినేస్తుంటారు.అలాంటప్పుడు జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయక,జీర్ణ సమస్యలు మొదలవుతాయి. మెడ, వెన్ను నొప్పులు..ఫోన్ చూసే వారు కదలకుండా,పొజిషన్ మార్చకుండా ఒకే చోట, ఒకే వైపు చూస్తూ కూర్చుంటే, వారికి క్రమంగా వెన్ను మరియు మెడ నొప్పులు వచ్చే అవకాశం వుంది.