Health

మీ కళ్లు అప్పుడప్పుడు ఎర్రగా మారుతున్నాయా..? అది ఎంత ప్రమాదానికి సంకేతమో తెలుసా..?

హైపర్ టెన్షన్ అతి తీవ్రస్థాయికి పెరిగినప్పుడు వివరీతమైన తలనొప్పి నిద్రలేమి, చూపు మసకభారతం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వానతీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి. గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుపోతాయి. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం రావచ్చు. కళ్లు దెబ్బతింటాయి. అయితే హైపర్‌టెన్షన్ అని కూడా పిలిచే ఇది పైకి ఎలాంటి లక్షణాలు చూపించకుండానే ప్రాణాంతకంగా మారుతుంది. ఇది కంటి చూపుతో సహా అనేక సమస్యలను కలిగించే తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి.

అధిక రక్తపోటు కళ్ళలోని చిన్న రక్త నాళాలను దెబ్బతీస్తుంది, ముఖ్యంగా రెటీనా లో రక్త నాళాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. రెటీనా కాంతిని ఇమేజ్‌లుగా మార్చే కంటిలోని ముఖ్యమైన భాగం. రెటీనా భాగంలోని రక్త నాళాలు దెబ్బతింటే ఆ నష్టం హైపర్‌టెన్సివ్ రెటినోపతి అనే పరిస్థితికి దారి తీస్తుంది, ఇది దృష్టిని ప్రభావితం చేస్తుంది. చికిత్స చేయకపోతే అంధత్వానికి కూడా కారణమవుతుంది. అందువల్ల, అధిక రక్తపోటు ఉంటే డాక్టర్‌ను కన్సల్ట్ కావడం చాలా ముఖ్యం. కళ్ళను క్రమం తప్పకుండా చెక్‌ చేస్తూ కూడా ఉండాలి.

కళ్లు రక్తం రంగులో ఎర్రగా ఉంటే వెంటనే హై బీపీ ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. హైబీపీ వల్ల ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, మూత్రంలో బ్లడ్, తలనొప్పి, ముక్కు నుంచి రక్తస్రావం, అలసట వంటి అనేక ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. 65 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు రక్తపోటు ముప్పు నుంచి బయటపడేందుకు కంటినిండా నిద్రపోవాలి. హై బీపీ లక్షణాలు..ఎర్రటి కళ్ళు..అధిక రక్తపోటు కళ్ళలోని రక్తనాళాలు పగిలి పోయేలా చేస్తుంది, దీనివల్ల అవి ఎర్రగా రక్తం రంగులో కనిపిస్తాయి. రోగికి వీటి వల్ల చాలా అసౌకర్యం కలుగుతుంది.

తలనొప్పి..హైపర్‌టెన్షన్ మెదడులో ఒత్తిడిని పెంచుతుంది, దీనివల్ల తలనొప్పి తీవ్రంగా లేదా నిరంతరంగా ఉండవచ్చు. వికారం..హై బీపీ జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేసి వికారం, వాంతుల సమస్య పెంచుతుంది. అనారోగ్యంగా అనిపించడం..హైబీపీ పేషంట్స్‌ అలసటగా, బలహీనంగా ఫీలవుతారు. మైకముతో ఉంటారు. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడతారు. హైబీపీ ముప్పు ఎందుకు పెరుగుతుంది.. ఫిజికల్ వర్క్ చేయకపోవడం వల్ల దీని రిస్క్ పెరుగుతుంది. అధిక ఉప్పు తీసుకోవడం కూడా ప్రమాదకరమే. ఎక్కువ ఉప్పు శరీరం నీటిని నిలుపుకునేలా చేస్తుంది, రక్త పరిమాణం, ఒత్తిడిని పెంచుతుంది.

ఊబకాయం లేదా ఓవర్‌వెయిట్ గుండె, రక్త నాళాలపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది, అలాగే కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, ఇది రక్తపోటును ప్రభావితం చేస్తుంది. ధూమపానం రక్త నాళాలను దెబ్బతీస్తుంది, అవయవాలకు ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది, ఇది రక్తపోటును పెంచుతుంది. ఆల్కహాల్ లేదా కెఫిన్ తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఆల్కహాల్ లేదా కెఫిన్ నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది, రక్తపోటు మందులతో జోక్యం చేసుకోవచ్చు, ఇది రక్తపోటును పెంచుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker