Health

ఈ ఆహారపు అలవాట్లు పాటిస్తే మీ లివర్ జీవితకాలం ఆరోగ్యంగా ఉంటుంది.

కాలేయం దెబ్బతినడం ప్రారంభిస్తే, శరీరంలో అనేక రకాల సమస్యలు కూడా మొదలవుతాయి. ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే కాలేయ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే కాలేయం ఎలా పాడవుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణం చెడు జీవనశైలితో పాటు తప్పుడు ఆహారపు అలవాట్లు. అయితే మానవ శరీరంలోని ముఖ్య అవయవాల్లో లివర్ కూడా ఒకటి. లివర్ ఆరోగ్యంగా ఉంటే ఎన్నో రకాల ఇన్ ఫెక్షన్లు, వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.

అదే విధంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎన్నో రకాల వ్యాధులను వస్తున్నాయి. మనం ఎలాంటి పనులు చేయాలన్నా లివర్ ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి లివర్ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కాలేయ కణాల్లో అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు.. లివర్ లో కొవ్వు ఏర్పడుతుంది. అధికంగా షుగర్ ఉన్న పదార్థాలు తీసుకోవడం, మద్యపానం వంటి వల్ల కాలేయం పాడవ్వడానికి ఒక కారణం అయితే..

స్థూల కాయం వల్ల కూడా లివర్ పై ఎఫెక్ట్ పడుతుందని ఇటీవల అధ్యయానాల్లో తేలింది. ఆహారం:-పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు అలాగే లీన్ ప్రోటీన్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేయబడిన ఫుడ్, షుగర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. వీటిల్లో కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. దీంతో కాలేయ కణాలు దెబ్బతింటాయి. కాబట్టి కొవ్వు తక్కువగా ఆహార పదార్థాలు తీసుకుంటేనే మంచిది.

మితమైన మద్యపానం:- మద్యపానంకు వీలైనంత వరకూ దూరంగా ఉంటేనే మంచిది. ఒక వేళ తాగినా మితంగా తీసుకోవడం మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఆల్కహాల్ వల్ల కాలేయంలో కొవ్వు మరింత పెరిగి.. పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బరువు నిర్వహణ:- బరువును ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. అధికంగా బరువు పెరిగినా ఈ ప్రభావం లివర్ పై పడుతుంది. కాబట్టి ప్రతి రోజు వ్యాయామం చేయాలి. దీని వల్ల బరువును అదుపులో ఉంచకోవచ్చు. ఎక్సర్ సైజ్ చేయడం వల్ల కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చు.

హైడ్రేట్ గా ఉండాలి:- సరైన ఆర్ద్రీకరణ కాలేయ పని తీరుకు సహాయ పడుతుంది. రోజూ కనీసం 8 గ్లాసు నీటిని తాగడం లక్ష్యంగా పెట్టుకోవాలి. దీంతో బాడీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మెడిసిన్ ను పరిమితంగా తీసుకోవాలి:- ఒకవేళ ఇతర అనారోగ్య సమస్యలకు మెడిసిన్ ను వాడుతూ ఉంటే.. వైద్యున్ని సంప్రదించి లిమిట్ గా తీసుకునే విధంగా చెప్పండి. మెడిసిన్ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయానికి హాని కలుగుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker