Health

ప్లాస్టిక్‌ వాటర్ బాటిల్ కొని నీళ్లు తాగుతున్నారా..? క్యాన్సర్, మధుమేహంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యల ముప్పు.

ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ను తప్పనిసరిగా తీసుకెళ్తుంఆరు. అయితే, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ లేకుండా ప్రయాణం చేయడం సాధ్యమేనా? అనే సందేహం వస్తే.. అది లేకుండా ప్రయాణించడం కొంచెం సవాలుతో కూడుకున్నదే.. అయినప్పటికీ.. మన ఆరోగ్యంపై దృష్టి సారిస్తే.. సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. ప్లాస్టిక్ బాటిళ్లను నివారించేందుకు ముఖ్యంగా రోడ్డు పక్కన విక్రయించే ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే నీరు మనిషికి ప్రధాన జీవనాధారం. అత్యాధునిక సాంకేతికత యుగంలో తాగునీటి అవసరాలకోసం 20 లీటర్ వాటర్ క్యాన్‌ లపై గ్రామస్ధాయి నుండి పట్టణస్ధాయి వరకు ప్రజలు అధారపడుతున్నారు.

రోజువారీ తాగునీటి అవసరాలకోసం ఈ వాటర్ క్యాన్‌లపై ఆధారపడి వారికి నిపుణులు తీవ్రస్ధాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాటర్ క్యాన్‌ల నీరు తాగడం అన్నది దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా ముప్పు కలిగే ప్రమాదముందన్న ఆంళోన వ్యక్తమౌతుంది. పర్యావరణంపై ప్లాస్టిక్ ప్రభావం.. ప్లాస్టిక్ శతాబ్దాలుగా విచ్ఛిన్నం కాకుండా ఉండే లక్షణం కలిగి ఉండటం వల్ల పర్యావరణానికి హానికరంగా మారింది. నీటి నిల్వ కోసం ఉపయోగిస్తున్న ఈ కంటైనర్లను పాతవిగా మారటం వల్ల వ్యర్ధాలుగా పారేస్తున్నారు. ఇవన్నీ జల జీవావరణ వ్యవస్థలు కాలుష్యం కావటానికి కారణమవుతున్నాయి.

వన్యప్రాణులు , సహజ సమతుల్యతకు ముప్పు గా మారుతున్నాయి. ప్లాస్టిక్ ఉత్పత్తి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను వెదజల్లుతున్నాయి. మానవ ఆరోగ్యానికి హానికలిగించే ప్లాస్టిక్.. ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లలో ఎక్కువసేపు నిల్వ ఉంచిన నీటిని ఉపయోగించడం వల్ల కలిగే కొన్ని హానికరమైన దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఉంటుంది. మానవ ఆరోగ్యానికి అతిపెద్ద ముప్పుగా ప్లాస్టిక్ నుండి వెలువడే రసాయనాలు కారణమవుతాయి. నీటి నుండి ఈరసాయనాలు రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. వాటర్ క్యాన్‌లు ఎక్కువసేపు సూర్యరశ్మికి గురైనప్పుడు ఈ రసాయనాలు నీటిలో కలుస్తాయి. నీటి క్యాన్‌లను ఎండతగిలేలా వాహనాల్లో రవాణా చేయడం, నేరుగా సూర్యకాంతి తగిలేలా దుకాణాల్లో నిల్వ చేయడం వల్ల హానికర రసాయనాలు నీటిలోకి చేరతాయి.

ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌ల వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రమాదాలు.. ప్లాస్టిక్ వాటర్ క్యాన్లను ఉపయోగించడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా జీర్ణ సమస్యలు , హార్మోన్లలో అసమతుల్యత, క్యాన్సర్ మరియు PCOS వంటి పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇమ్యూన్ సిస్టమ్‌పై ప్రభావం: ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌ల నుండి నీరు తాగడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థకు అంతరాయం కలుగుతుంది. ప్లాస్టిక్ నుండి వెలువడే రసాయనాలు శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్ధకు భంగం కలిగిస్తాయి.

డయాక్సిన్ ఉత్పత్తి:- ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లకు సూర్యరశ్మి వేడి తగలటం వల్ల డయాక్సిన్ అనే హానికరమైన టాక్సిన్ విడుదల అవుతుంది, దీనిని తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. కాలేయ క్యాన్సర్, స్పెర్మ్ కౌంట్ తగ్గటం:- ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లలో థాలేట్స్ అనే రసాయనం ఉండే అవకాశాలు ఉన్నాయి. వాటిలోని నీటిని తీసుకోవడం వల్ల కాలేయ క్యాన్సర్ ,స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది.

క్యాన్సర్ కు కారణమవుతుంది. రక్తప్రవాహంలోకి ప్రవేశించగల BPA వంటి పదార్థాలు కణాలకు హాని కలిగించడానికి చాలా సమయం పట్టవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. హానికలిగించే బిస్ఫినాల్ అనే రసాయనం :- ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లు బిస్ఫినాల్ A (BPA) అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది ఈస్ట్రోజెన్‌ పై ప్రభావాన్ని చూపిస్తుంది. మధుమేహం, ఊబకాయం, సంతానోత్పత్తి సమస్యలు, బాలికలలో యుక్తవయస్సులో అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అందుకే ప్లాస్టిక్ వాటర్ క్యాన్లలో నీటిని నిల్వ ఉంచుకోవడం, త్రాగడం మానుకోవడం మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker