పురుషుల్లో త్వరగా బట్టతల వచ్చే వారికీ క్యాన్సర్‌కు వచ్చే ప్రమాదం చాలా ఎకువగా ఉంది.
జుట్టు ఎక్కువగా రాలడం, బట్టతల వంటి సమస్యలు తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రధానంగా వయస్సు ప్రభావం, జన్యుపరమైన కారణాలు, పోషక లోపాలు, జీవనశైలి అలవాట్లు, స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్లు, దీర్ఘకాలికమైన ఒత్తిడి, మందుల వాడకం కారణాలు ఉంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పురుషులలో బట్టతల అనేది ప్రస్తుతం అందోళన కలిగిస్తున్న సమస్య. 20 నుండి 30 ఏళ్ల వయస్సులో ఉన్నారు ఊహించిన దానికంటే వేగంగా జుట్టు పలుచబడటం, ఊడిపోవటం జరుగుతుదోంది.
అకాల బట్టతల వెనుక అనేక కారణాలు ఉండి ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని రకాల క్యాన్సర్ ల కారణంగా కూడా ఇలే జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. జుట్టు రాలటం అన్నది క్యాన్సర్ వంటి మరింత తీవ్రమైన సమస్యకు సూచనా? బట్టతల అన్నది క్యాన్సర్‌కు సంకేతం అనే విషయంపై ఏదైనా శాస్త్రీయ ఆధారం ఉందా అన్న అపోహ చాలా మందిలో ఉంటుంది.
అయితే 2016లో జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, అవును అనే సమాధానం చెప్పాలి. ఈ అధ్యయనం ప్రకారం, చిన్న వయస్సులో మగవారి బట్టతల వస్తే పురుషులు తరువాతకాలంలో ప్రోస్టేట్ క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాల్లో కనుగొన్నారు. పరిశోధనలో 20,000 మంది పాల్గొనగా వారి నుండి డేటాను విశ్లేషించడం ద్వారా దీనిని గుర్తించారు.
ఇతర రకాల క్యాన్సర్ల విషయానికి వస్తే :- బట్టతలకి ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఏకైక కారకం కాకపోయినప్పటికీ 2017లో బ్రిటీష్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురించబడిన మరో అధ్యయనంలో మగవారి బట్టతలకు ఆతరువాత కాలంలో మెలనోమా వంటి చర్మ క్యాన్సర్ అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. అదేవిధంగా జన్యుశాస్త్రం ప్రకారం బట్టతల , క్యాన్సర్ ప్రమాదం రెండింటిలోనూ కుటుంబ చరిత్ర కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
దగ్గరి బంధువులు క్యాన్సర్ గురైన చరిత్ర ఉంటే, ముఖ్యంగా బట్టతల రావటం ద్వారా అలాంటి వారిలో క్యాన్సర్ల ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చివరిగా పురుషులలో బట్టతల రావటం అన్నది క్యాన్సర్ దారితీసే అవకాశానికి స్పష్టత లేకపోయినప్పటికీ, శాస్త్రీయ ఆధారాలు మాత్రం అందుకు అవకాశాలు ఎక్కువ ఉండవచ్చునని సూచిస్తున్నాయి. అకాల బట్టతల సమస్యను ఎదుర్కొంటుంటే వెంటనే క్యాన్సర్ ప్రమాదం పై వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది.