వాకింగ్ చేసేటప్పుడు వెనక్కి నడవడం వల్ల వంద రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
కొన్ని ఆరోగ్య సూత్రాల ప్రకారం వారంలో కనీసం కొన్ని రోజులైనా రోజుకు 10 నుండి 20 నిమిషాల పాటు వ్యతిరేక దిశ(వెనక్కి)నడవండి. ఇది కండరాలను బలంగా మారుస్తుంది. అంతే కాదు మనస్సును ఆధీనంలో పెట్టుకోవడంలో చాలా హెల్ప్ అవుతుంది. రివర్స్‌లో రన్నింగ్ చేయడం వల్ల కాళ్లకు శక్తి పెరుగుతుంది. వెనుకకు నడవడం వల్ల కదలని కొన్ని కాలి కండరాలకు బలం పెరిగి కదులుతాయి. అంతే కాదు మోకాలి గాయాల నుండి కోలుకోవడానికి సహాయపడుతుంది.
ఇది శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఎక్కువ కేలరీలను వేగంగా కరిగిస్తుంది. శరీర బరువును నియంత్రించడంలో రివర్స్ వాకింగ్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది ఎముకలు మరియు కండరాలను కూడా బలంగా ఉంచుతుంది. అయితే అప్పుడప్పుడు పిల్లలు వెనక్కి నడుస్తూ వుంటారు. అది చూసి నవ్వుతూ ఉంటారు పెద్దలు కూడా వెనక్కి నడుస్తూ ఉంటారు. నిజానికి వెనక్కి నడవడం వలన జోక్ ఏమీ లేదు వెనక్కి నడవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
చాలా మందికి వెనక్కి నడవడం వలన కలిగే ఉపయోగాలు ఏంటో తెలియదు. సాధారణంగా మనం నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే ముందుకే కాదు వెనక్కి నడిచిన కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మామూలుగా ఎవరైనా ముందుకు నడుస్తూ ఉంటారు కానీ వాకింగ్ చేసేటప్పుడు ముందుకే కాదు వెనక్కి కూడా నడవచుట.
ప్రతిరోజు వాకింగ్ చేస్తే శారీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది మనం వెనక్కి నడిస్తే ఎవరైనా చూసి నవ్వుతారు కానీ వెనక్కి నడిస్తే పలు బెనిఫిట్స్ ని పొందొచ్చు. ముందుకు నడవడం వలన కంటే వెనక్కి నడవడం వలన ఖర్చు అయ్యే శక్తి ఎక్కువ ఉంటుంది దానికంటే ఇది 40% ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. దాంతో శరీరంలో కొవ్వు బాగా కరుగుతుంది కాళ్ల కండరాలిని దృఢంగా మార్చడానికి కూడా ఇది సహాయపడుతుంది. వెనక్కి నడిస్తే మంచి వ్యాయామం.
వేగంగా వెనక్కి నడిస్తే కాలి కండరాలు బలంగా మారుతాయి. వెనక్కి నడవడం వలన జీవక్రియలు కూడా మెరుగుపడతాయి. క్యాలరీలు బాగా ఖర్చవుతాయి. వెనక్కి నడిస్తే శారీర సమతుల్యత స్థిరంగా ఉంటుంది. బరువును నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. వెనక్కి నడిస్తే అనుకూలమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని మీరు నడవండి. ఇలా వెనక్కి నడిస్తే ఇన్ని లాభాలని పొంది మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.