మగవారు మంచి సంతానం కోసం ఎలాంటి పనులు చెయ్యాలో తెలుసుకోండి.
వైవాహిక జీవితం కూడా బాగుంటుంది అని ప్రజలు నమ్ముతారు.అలాగే భార్యా భర్తల దాంపత్యంలో గొడావలు లేకుండా ఉండాలంటే మనం కొన్ని చిట్కాలను కచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య సఖ్యత చేకూరడానికి వాస్తు ప్రకారం కొన్ని పద్ధతులను పాటించాలి. అయితే ఈ రోజుల్లో పురుషులు నిరంతరం ఒత్తిడికి గురవుతున్నారు. చిన్నవయసులోనే కుంటుంబ బాధ్యతలని మోస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పెళ్లైన తర్వాత సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
అందుకే పిల్లల కోసం ప్లాన్ చేసే పురుషులు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా స్పెర్మ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడి, ఆందోళనలు, చెడు అలవాట్లు మొదలైన కారణాల వల్ల స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుంది. దీనివల్ల చాలామంది సంతాన బాగ్యానికి దూరమవుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని.. ఆరోగ్యకరమైన జీవనశైలి స్పెర్మ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. తగినంతగా హైడ్రేటెడ్ గా ఉండాలి.
అధిక మద్యపానం, ధూమపానం, మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించాలి. ఎందుకంటే ఈ అలవాట్లు స్పెర్మ్ ఉత్పత్తిని, నాణ్యతను దెబ్బతీస్తాయి. ఒత్తిడి కంట్రోల్.. దీర్ఘకాలిక ఒత్తిడి స్పెర్మ్ నాణ్యతని దెబ్బతీస్తుంది. కాబట్టి ఒత్తిడి, ఆందోళన నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. శరీరానికి, మనసుకు తగినంత విశ్రాంతిని అందించాలి. ఇందుకోసం వ్యాయామం, ధ్యానం, యోగా సాధన చేయాలి. ఇష్టమైన హాబీలు, నచ్చిన పనులని చేయాలి.
రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలి. ప్రశాంతంగా ఉండటం కోసం తగిన వాతావరణాన్ని సృష్టించుకోవాలి. వీటివల్ల స్పెర్మ్ నాణ్యత మెరుగవుతుంది. బరువు కంట్రోల్.. అధిక బరువు లేదా తక్కువ బరువు ఈ రెండు పరిస్థితులు స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీనివల్ల మెరుగైన స్పెర్మ్ నాణ్యత ఏర్పడుతుంది.
సమతుల్య ఆహారం ద్వారా బరువుని కంట్రోల్ చేసుకోవచ్చు. అవసరమైతే పోషకాహార నిపుణుడి సలహా తీసుకోవాలి. ప్రమాదాలకి దూరం.. స్పెర్మ్ నాణ్యతకి హాని కలిగించే పర్యావరణ కారకాలకు గురికాకుండా ఉండాలి. అధిక వేడి స్నానాలు చేయవద్దు. బిగుతైన దుస్తులు వేసుకోవద్దు. వృషణాలు వేడికి గురికాకుండా చూసుకోవాలి. అవసరమైన మంచి అలవాట్లని పాటించాలి.