బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య, కారణం ఏంటో తెలుసా..?
చెన్నై అళ్వార్‌పేటలో గల డీడీకే రోడ్‌లో నివసిస్తోంది విజయ్ ఆంటోనీ కుటుంబం. ఆయనకు భార్య ఫాతిమా, ఇద్దరు కుమార్తెలు లారా ఆంటోని, మీరా ఆంటోనీ ఉన్నారు. 16 సంవత్సరాల మీరా చర్చ్ పార్క్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్నారు. చదువులో వెనుకపడటం ఒత్తిడిలోకి నెట్టినట్టు చెబుతున్నారు.
అయితే బిచ్చగాడు తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ ఆంటోని కూతురు మీరా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మీరా 12 వ తరగతి చదువుతోంది.
ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసిన వెంటనే దగ్గర్లోనియూ కావేరి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మీరా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీరా ఆత్మహత్యకు కారణం ఏంటా అని దర్యాప్తు చేస్తున్నారు.
విజయ ఆంటోని మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా లకు సంగీతం అందించారు. అలాగే సింగర్ గాను తన ప్రతిభ చాటారు. ఇక బిచ్చగాడు తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు విజయ్ ఆంటోని అంతకు ముందు పలు లతో తెలుగులో అలరించారు.
రీసెంట్ గా బిచ్చగాడు 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ ఆంటోనీ ఫాతిమాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒకేఒక్క కూతురు మీరా. మీరా ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడంతో విజయ్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.