News

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో కీర్తి సురేష్ పెళ్లి, అసలు విషయమేంటో తెలిస్తే..?

త్వరలోనే కీర్తి సురేష్ పెళ్లి పీటలెక్కబోతోందంటూ బోలెడన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. అంతేకాదు పెళ్లి కొడుకు కూడా ఇతనే అంటూ ప్రచారాలు షురూ అయ్యాయి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ తో కీర్తి చాలా చనువుగా ఉంటోందని, అతన్నే ఆమె పెళ్లాడనుందనే వార్తలు జోరుగా వచ్చాయి. అయితే జవాన్‌ సినిమా డైరెక్టర్‌ అట్టి కుమార్‌ ప్రముఖ నటి కీర్తి సురేశ్‌ స్నేహితుడు. ఆ సినిమా సక్సెస్‌ను కీర్తి కూడా ఎంజాయ్‌ చేస్తోంది.

ఈ క్రమంలో ఆ సినిమా మ్యూజిక్‌ డైరెక్టర్‌తో దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలోకి వచ్చాయి. దీంతో పెళ్లి ఫిక్స్‌ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. కీర్తి సురేశ్, అనిరుధ్‌ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటికానున్నరంటూ కొన్నాళ్ల క్రితమే పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు, నెట్టింట పోస్టులు వెలిశాయి. ఆ సమయంలో కీర్తి స్పందిస్తూ.. ‘నా పెళ్లి గురించి వస్తోన్న వార్తలు, పోస్టులు చూసి షాక్‌ అయ్యా.

కొంతమంది నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ఇప్పటికే, మూడు, నాలుగుసార్లు నాకు పెళ్లి చేసేశారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటా’ అని తెలిపారు. అనిరుధ్‌ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. మరోవైపు, తన స్నేహితుడితో కలిసి దిగిన ఫొటోను కీర్తి సురేశ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. ‘కీర్తికి కాబోయే వరుడు ఇతడే’ అంటూ పలు వెబ్‌సైట్లు కథనాలు అల్లాయి.

ఆ సమయంలో సురేశ్‌ కుమార్‌ వాటిని ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ‘కీర్తి సురేశ్‌కు పెళ్లి కుదిరితే మీడియాకు, ప్రజలకు ముందుగా మేమే చెబుతాం. ఇలాంటి సున్నితమైన విషయాలపై రూమర్స్‌ క్రియేట్‌ చేయొద్దు. దీని కారణంగా కుటుంబంలో మనశ్శాంతి కరవవుతుంది‘ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ రూమర్స్‌పై కీర్తి సురేశ్‌ తండ్రి సురేశ్‌కుమార్‌ స్పందించారు. ఆ వార్తల్లో నిజంలేదంటూ వాటిని ఖండించారు.

‘ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి రూమర్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. మీకు మీరే డిసైడ్‌ అయితే ఎలా.. నాతో పని లేకున్నా.. నా కూతురును అయినా అడిగరా’ అని ప్రశ్నించారు. కీర్తి సురేశ్‌ పెళ్లిపై వదంతులురావడం ఇదే తొలిసారి కాదు. గతంలో పలుమార్లు వచ్చిన రూమర్సన్న కీర్తి సురేశ్, ఆమె కుటుంబ సభ్యులు ఖండించినా మళ్లీ రావడం గమనార్హం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker