ఒక రోజుకి కమెడియన్ యోగిబాబు రెమ్యునరేషన్ తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది. హీరోలు కూడా..?
స్టార్ హీరోల చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటిస్తూనే మరో పక్క కథానాయకుడిగానూ నటిస్తున్నారు. అలా ఆయన హీరోగా నటించిన చిత్రాలు ఇటీవల వరుసగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇటీవలే యోగిబాబు హీరోగా నటించిన లక్కీమెన్ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం బూమర్ యాంగిల్, హైకోర్ట్ మహారాజా, వానవన్, రాధామోహన్ దర్శకత్వంలో నటిస్తున్న చట్నీ సాంబార్ మొదలగు అరడజనుకు పైగా చిత్రాలు ఈయన చేతిలో ఉన్నాయి.
తాజాగా యోగిబాబు కథానాయకుడిగా మరో నూతన చిత్రం మంగళవారం తెన్‌కాశీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దీనికి ఆంధ్రా మెస్ జయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అంతటి క్రేజ్ ని సంపాదించుకున్నాడు యోగిబాబు. పెద్దగా అందం లేకపోయినప్పటికీ తన నటనతో, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుని తెచ్చుకున్నాడు.
రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలో యోగి బాబు తన అద్భుతమైన కామెడీతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ‘జవాన్’ సినిమాలో షారుక్ ఖాన్ తనకి ఛాన్స్ ఇచ్చాడు.
జవాన్ సినిమాలో యోగిబాబుకి సపరేట్ కామెడీ ట్రాక్ ఉంటుందని, బాలీవుడ్ లో కూడా యోగిబాబుకి అవకాశాలు వస్తాయని అంటున్నారు విశ్లేషకులు. యోగిబాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 14 సంవత్సరాలవుతుంది. తన క్రేజ్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.
యోగి బాబు ఇప్పటికీ 200పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక ఇతను తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక యోగిబాబు పాన్ ఇండియన్ స్టార్ కమెడియన్ గా మారబోతున్నారు.