News

బయపెడుతున్న నిపా వైరస్‌, వారం పాటు స్కూళ్లు, కాలేజీలు బంద్.

కరోనా వైరస్‌ కంటే నిపా వైరస్‌ డేంజర్‌ అని, కొవిడ్‌-19 కంటే నిపా సోకిన వారిలో మరణాల రేటు ఎక్కువని పేర్కొన్నారు. నిపా వైరస్‌ బారిన పడిన వారిలో మరణాల సంఖ్య 40-70 శాతం వరకు ఉంటుందని, ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌ మరణాల రేటు 2-3 శాతం మాత్రమేనని అన్నారు. మరోవైపు కేరళలో మరొకరికి నిపా వైరస్‌ సోకింది. అయితే నిపా వైరస్ దృష్ట్యా, కోజికోడ్‌లోని అన్ని విద్యాసంస్థలు వచ్చే ఆదివారం వరకు అంటే సెప్టెంబర్ 24 వరకు మూసివేయబడ్డాయి.

ఇందులో పాఠశాలలు, ప్రొఫెషనల్ కళాశాలలు, ట్యూషన్ సెంటర్లు కూడా ఉన్నాయి. వారం రోజుల పాటు అన్ని విద్యా సంస్థల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించవచ్చని జిల్లా యంత్రాంగం చెబుతోంది. ప్రస్తుతం నిపా వైరస్ సోకిన వారితో పరిచయం ఉన్న వారి జాబితా 1080కి చేరుకుందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శుక్రవారం తెలిపారు. వీరిలో శుక్రవారం ఒక్కరోజే 130 మంది జాబితాలో చేరారు. మొత్తం 1080 మందిలో 327 మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇతర జిల్లాల్లో నిపా సోకిన వ్యక్తుల కాంటాక్ట్ లిస్ట్‌లో మొత్తం 29 మంది ఉన్నారని ఆరోగ్య మంత్రి చెప్పారు.

వీరిలో మలప్పురం నుండి 22 మంది, వాయనాడ్ నుండి ఒకరు, కన్నూర్, త్రిస్సూర్ నుండి ముగ్గురు చొప్పున ఉన్నారు. హై-రిస్క్ కేటగిరీలో 175 మంది సాధారణ పౌరులు కాగా 122 మంది ఆరోగ్య కార్యకర్తలు. కాంటాక్ట్ లిస్ట్‌లో చేరిన వారి సంఖ్య పెరగవచ్చని ఆరోగ్య మంత్రి కూడా చెప్పారు. ఆగస్టు 30న ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి రిపోర్టు పాజిటివ్‌గా వచ్చిందని, దాని వల్లే రాష్ట్రంలో నిపా కేసులు పెరిగాయని చెప్పారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరు నిపా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. కేరళలో విజృంభించిన ఈ వైరస్ కారణంగా భయానక వాతావరణం నెలకొంది. ఆగస్టు 30న ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి అంత్యక్రియలకు కనీసం 17 మంది హాజరయ్యారు. ఈ వ్యక్తులందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. నిపా వైరస్ సోకిన నలుగురు వ్యక్తులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నిపా కేసులకు చికిత్స అందిస్తున్న అన్ని ఆస్పత్రుల్లో మెడికల్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బోర్డు సమావేశం రోజుకు రెండుసార్లు జరగనుంది. దీని తర్వాత తయారు చేసిన నివేదికను ఆరోగ్య శాఖకు సమర్పించాలని కోరారు. రాష్ట్ర ‘ఇన్ఫెక్షియస్ డిసీజ్ కంట్రోల్ ప్రోటోకాల్’ ఆధారంగా జిల్లా కలెక్టర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker