Health

నిమిషాల్లోనే షుగర్ ని తగ్గించే ఇంగువ, ఎలా వాడలో తెలుసుకోండి.

ఒక అరకప్పు నీటిలో చిన్నచిన్న కొన్ని ఇంగువ ముక్కలను కరగించి తీసుకొంటే అజీర్తి, ఋతుసమస్య నుండి వెంటనే ఉపశమనం కల్గుతుంది. స్త్రీలకు సంబంధించిన రుతు సంబంధ సమస్యలు నొప్పి, తిమ్మిరి, వంటి వాటికి ఇంగువ చక్కగా పని చేస్తుంది. అయితే వంటిల్లే వైద్య శాల అని ఊరికే అనలేదు పెద్దలు. వంటింట్లోని దొరికే అన్ని రకాల వస్తువులతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పురాతన కాలంలో ఈ డాక్టర్లు, మందులు ఉండేవి కాదు. అన్నీ నాటు వైద్యాలే. ఇంట్లో దొరికే వస్తువులతోటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టేవాళ్లు.

వంటింట్లో ఉపయోగించే వస్తువుల్లో ఇంగువ కూడా ఒకటి. సాధారణంగా ఇంగువను వంటల్లో రుచి కోసం ఉపయోగిస్తారు. కానీ ఇంగువతో కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చన్న విషయం మీకు తెలుసా. దీని వాడటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. డయాబెటీస్ కంట్రోల్.. డయాబెటీస్ తో బాధ పడేవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే అనే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇలాంటి వారికి ఇంగువ చాలా హెల్ప్ చేస్తుంది.

ఇంగువలో మధుమేహాన్ని కంట్రోల్ చేసే లక్షణాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ తరచూ ఇంగువను తీసుకుంటే బ్లడ్ లో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అలాగే రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచడంలో కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. కిడ్నీలు సక్రమంగా..మూత్ర పిండాలు ఆరోగ్యానికి కూడా ఇంగువ బాగా సహాయ పడుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాలు మూత్రంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.

అలాగే శరీరంలో ఉన్న అదనపు క్రియాటినిన్, యరియాను కూడా బయటకు పండంలో ఇంగువ బాగా హెల్ప్ చేస్తుంది. దీని వల్ల యూరిన్ ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. జీర్ణ క్రియ మెరుగ్గా ఉంటుంది..క్రమం తప్పకుండా ఇంగువను తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. జీర్ణాశయానికి సంబంధించి సమస్యలు రాకుండా చూస్తుంది. దీంతో గ్యాస్, అజీర్తి, అసిడిటీ, కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దరి చేరవు.

ఇంగువలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ వంటి గుణాలు ఉండటం వల్ల రెయినీ సీజన్ లో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చు. పంటి నొప్పి సమస్య తగ్గించుకోవచ్చు..చాలా మంది పంటి నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారికి ఇంగువ బాగా హెల్ప్ చేస్తుంది. కాస్త గోరు వెచ్చగా ఉన్న నీటిలో ఇంగువల వేసి పుక్కిలిస్తే పంటి నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే నోట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker