News

భార్య డ్రెస్ వేసి అమ్మాయిలా మారాడు, తర్వాత ఏం చేసాడో తెలుసా..?

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణంలో యువతి వేషధారణతో చోరీ చేసిన మండల కేంద్రానికి చెందిన యువకుడు రామిండ్ల సుధీర్ ను రిమాండ్ కి తరలించామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. గ్రామంలోని రామిండ్ల నాంపల్లికి చెందిన భవనంలో మండలంలోని సింగారం గ్రామంలోని గనగోని బంటి లక్ష్మీనారాయణ ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ నెల 9న రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లిపోయారు . 11న ఉదయం దుకాణానికి వచ్చి చూడగా వెనుక ఉన్న తలుపు తీసి ఉంది . కౌంటరులోని రూ.3500 నగదు అపహరణకు గురైందని గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు . అయితే ఇటీవల జనం మీద సినిమా ప్రభావం బాగానే పడింది. ఏం చేసిన పక్కా ఫ్లాన్‌తో బురిడీ కొట్టిస్తున్నారు.

తాజాగా ఎవరికీ అనుమానం రాకుండా.. ఇంటి ఓనరే.. తానూ అద్దెకు ఇచ్చిన షాపులోనే కన్నం వేశాడు. ఈ ఇంటి దొంగ ఎలా ప్లాన్ చేశాడన్న దానిపై కూపీ లాగిన పోలీసులకు షాకయ్యే అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు ఎవరికీ అనుమానం రాకుండా యువతి వేషధారణ ధరించి తన భవనంలోని దుకాణంలోనే దొంగతనానికి పాల్పడ్డాడు. భార్యకు సంబంధించిన సవరం, అమె డ్రెస్ ధరించి గుట్టు చప్పుడు కాకుండా దొంగతనం చేశాడు. చోరీకి పాల్పడిన దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో పోలీసులు 48 గంటల్లోనే కేసును ఛేదించారు.

రామిండ్ల నాంపల్లికి చెందిన భవనంలో సింగారం గ్రామానికి చెందిన గనగోని బంటి లక్ష్మీనారాయణ ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. సెప్టెంబర్ 9న రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. 11న ఉదయం దుకాణానికి వచ్చి చూడగా వెనుక ఉన్న తలుపు తీసి కనిపించింది. కౌంటరులోని నగదు అపహరణకు గురైందని గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker