Health

మీలో లక్షణాలు ఉన్నాయా..? మీకు రక్తప్రసరణ సరిగ్గా లేనట్టే..!

పేలవమైన రక్త ప్రసరణ సమస్యను ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్నారు. దీనికి స్థూలకాయం, ధూమపానం, డయాబెటిస్, రేనాడ్ వ్యాధి కారణాలు కావొచ్చు. రక్త ప్రవాహం సరిగ్గా లేకపోవడం వల్ల నొప్పి, కండరాల తిమ్మిరి, జీర్ణ సమస్యలు, చేతులు, కాళ్లలో తిమ్మిరి, చల్లదనం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు ఎక్కువైతే మందులతో తగ్గించుకోవచ్చు. అయితే ఈరోజుల్లో ఆరోగ్యం బాగా పాడై పోతోంది.

మనం తీసుకునే ఆహారం జీవన విధానం సరిగ్గా ఉండడం లేదు దాంతో ఆరోగ్యం బాగా పాడవుతుంది. రక్తప్రసరణ మానవ శరీరానికి కీలకమని అందరికీ తెలుసు. శరీరం అంతటా ఆక్సిజన్ పోషకాలని ఇది సరఫరా చేస్తుంది శరీర జీవ క్రియలు రక్తప్రసరణ కీలకపాత్ర పోషిస్తుంది అది కనుక సక్రమంగా జరగకపోతే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాలి.

సరిగ్గా రక్తప్రసరణ జరగకపోతే గుండె సమస్యలు కూడా వస్తాయి, అయితే శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదని మనం ఈ లక్షణాలు చూసి తెలుసుకోవచ్చు. ఒకవేళ కనుక ఈ లక్షణాలు ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. తరచుగా కాలంలో చీలిమండలలో పాదాలలో వాపు కలుగుతున్నట్లయితే కచ్చితంగా రక్తప్రసరణ సరిగా జరగడం లేదని గుర్తించాలి.

రక్తం గుండెకి తిరిగి రావడానికి కష్టం అయినప్పుడు దిగువభాగంలో ద్రవం పేరుకుపోతుంది కళ్ళల్లో వాపు వంటివి కలుగుతాయి. రక్త ప్రవాహం సరిగ్గా లేనప్పుడు కండరాల పనితీరుకి అవసరమైన పోషకాలు అందనప్పుడు అలసటగా ఉంటుంది. రక్తప్రసరణ సరిగా లేకపోతే చేతులు పాదాలు ఇతర అవయవాల్లో తిమ్మిరి జలదరింపు ఉంటాయి.

రక్తప్రసరణ సరిగ్గా అవ్వకపోతే గాయాలు త్వరగా మానవు. రక్తప్రసరణ సరిగా లేకపోతే చర్మం రంగు మారడం వంటివి కలుగుతాయి. చేతులు కాళ్లు చల్లగా ఉంటాయి ఇలా ఈ లక్షణాలని బట్టి మనం రక్తప్రసరణ సరిగ్గా జరగడం లేదని తెలుసుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker