ఈ పొడిని పాలల్లో వేసుకొని తాగితే మీ శృంగార సామర్థ్యం రెట్టింపు అవుతుంది.
ఇండోనేషియాకి చెందిన మిరిస్టికా ఫ్రాగాన్స్ చెట్టు విత్తనం నుంచి వచ్చే మసాలా ఇది. తీపి,వగరు రుచిని కలిగి ఉంటుంది. బేకింగ్, సూప్, కూరలు, సాస్ కోసం మసాలాగా ఉపయోగిస్తారు. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాలు ఇస్తుంది.. జాజికాయలో మాంగనీస్, కాపర్, మెగ్నీషియం, ఫైబర్ సహ వివిధ పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, బి, సి తో పాటు ఖనిజాలు అందిస్తుంది. జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. అయితే వంటలలో దీన్ని తక్కువ పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలి.
అప్పుడే అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. జాజికాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మంటని తగ్గించడంలో సహాయపడతాయి. నిద్రలేమికి సహజ నివారణగా ఉపయోగపడుతుంది. జాజికాయని గోరువెచ్చని పాలతో లేదా నిద్రవేళకి ముందు ఆహారంలో తీసుకోవడం వల్ల నిద్రని ప్రోత్సహిస్తుంది. నిద్రలేమి, స్లిప్ అప్నియాతో బాధపడే వాళ్ళకి చక్కని ఔషధంగా పని చేస్తుంది. జాజికాయ నుంచి తీసిన నూనె ఆర్థరైటిస్, కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సహజ నొప్పి నివారిణిగా పని చేస్తుంది.
అయితే దీన్ని అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం విషపూరితం కావచ్చు. అందుకే జాగ్రత్తగా వినియోగించుకోవాలి. జాజికాయలో మిరిస్టిసిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుంచి కణాలని రక్షిస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మిరిస్టిసిన్ మెదడుని చురుగ్గా ఉంచుతుంది. అల్జీమర్స్ రాకుండా అడ్డుకుంటుంది. మహిళలు ఎందుకు తీసుకోవాలి.. జాజికాయ పురుషులు, మహిళలకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.
వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది. ముఖ్యంగా మహిళలు ఈ మసాలా తీసుకోవడానికి నిర్ధిష్టమైన కారణాలు ఏమి లేవు. అయితే దీన్ని మితంగా మాత్రమే తీసుకోవాలి. అధిక వినియోగం అనేక దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. గర్భిణీ స్త్రీలు పెద్ద మొత్తంలో జాజికాయ అసలు తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇది గర్భధారణపై ప్రతికూల ప్రభావాలని చూపిస్తుంది. అయితే జాజికాయలో సెక్స్ కోరికలు పెంచే గుణాలున్నాయంట. మగవారు ఆ సమయంలో దీన్ని తీసుకుంటే అందులో బాగా పార్టిసిపేట్ చేయొచ్చంట.
వీర్యవృద్ధికి తోడ్పడుతుందంట. దాంపత్య సమస్యలను జాజికాయ దూరం చేస్తుంది. అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందంట. చర్మానికి మేలు..జాజికాయ పొడి, తేనె కలిపి పేస్ట్ లాగా చేసుకుని మొహానికి స్క్రబ్ మాదిరిగా రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. మొటిమలు, చర్మ సమస్యల్ని నయం చేస్తుంది. ముడతలు నివారిస్తుంది.