Health

ఉదయాన్నే పరగడపున రెండు వేప ఆకులు తిన్నారంటే.. జీవితంలో హాస్పిటల్ కి వెళ్లారు.

ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేప ఆకులు తింటే శరీరంలోని సగం వ్యాధులు నయమవుతాయి. వేపలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రక్తాన్ని శుభ్రపరిచి రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. తద్వారా రక్తాన్ని నిర్విషీకరణ చేస్తుంది. మీ రక్తం పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవు. అయితే వేప ఆకులు ఖాళీ పొట్టతో తీసుకోవడం వల్ల పేగు వ్యవస్థని శుభ్రం చేస్తుంది.

ప్రస్తుత రోజుల్లో మనం పాటించే అనారోగ్యకరమైన జీవనశైలి, తీసుకునే ఆహారం, తాగే అలవాట్ల కారణంగా పేగు ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. పేగుల్లో మంట, అసౌకర్యం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిని నయం చేసేందుకు వేప ఆకులు ప్రభావవంతంగా పని చేస్తాయి. పొద్దున్నే నాలుగు వేపఆకులు నమలడం వల్ల కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఫ్రీ రాడికల్స్ వాలల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చేస్తాయి.

ఆక్సీకరణ ఒత్తిడి కాలేయ కణజాలాల్ని దెబ్బతీస్తుంది. వేప తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడొచ్చు. చేదు రుచి కలిగినప్పటికీ వేపని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బ్లడ్ షుగర్ సమస్యలు ఉన్నవాళ్ళు పొద్దున్నే కాసిన్ని వేప ఆకులు నమిలితే మంచిది. ఇది ఆరోగ్యాన్ని మొత్తం కాపాడుతుంది. పొట్ట సంబంధిత సమస్యల్ని నయం చేయడంలో వేప ఆకులు అద్భుతంగా పని చేస్తాయి. ఉబ్బరం, మలబద్ధకం వంటి వాటిని సులభంగా నయం చేస్తాయి. వేప ఆకుల్లో ఉండే పీచు పదార్థాలు పేగు కదలికలకు సహాయపడతాయి.

వేప ఆకులు తీసుకుని వాటిని శుభ్రంగా నీటిలో కడిగి మిక్సీ లేదా రోట్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దాని నుంచి రసాన్ని తీసుకోవచ్చు. వేప ఆకుల పేస్ట్ రుచి చాల చేదుగా ఉంటుంది. అందుకే మిక్సీ వేసినా రోకలితో రుబ్బినా కూడా వాటికి చేదు రుచి అంటుకుంటుంది. వాటితో మిగతావి ఏవి కలిపినా కూడా అది కూడా చేదు రుచిని ఇస్తాయి. ఎప్పుడు తాజాగా తయారు చేసిన వేప ఆకుల రసాన్ని తీసుకోవాలి. వేప ఆకులు బాణలిలలో వేయించి దాన్ని చేతులతో చూర్ణం చేసుకోవచ్చు.

అందులో వెల్లుల్లి, ఆవాల నూనె వేసుకుని కలుపుకోవచ్చు. దీన్ని అన్నంలో కూడా తినొచ్చు. ఒకేసారి ఎక్కువ వేప ఆకులు తినకూడదు. మంచి చేస్తుందని అతిగా తీసుకుంటే అది అనార్థాలు కలిగిస్తుంది. పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఇది ఆహారాలు, మందులకు ఎప్పుడు ప్రత్యామ్నాయం కాదు. వైద్యులని సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని తీసుకోవడం మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker