Health

మందులు వాడకుండా మధుమేహాన్ని ఎలా తగ్గించుకోవలో తెలుసుకోండి.

డయాబెటిస్ బారిన పడినవారు మధుమేహం నుంచి పూర్తిగా బయటపడవచ్చునని భారతీయ వైద్య పరిశోధన సంస్థ డయాబెటిస్ పై చేపట్టిన తాజా అధ్యయనం వెల్లడించింది. తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లను సగం శాతానికిపైగా తగ్గించుకోవడం, అదే సమయంలో ప్రొటీన్ల శాతాన్ని పెంచుకోవడం ద్వారా షుగర్ వ్యాధి శాశ్వతంగా దూరం చేసుకోవచ్చని ఐసీఎంఆర్ ఇండియా పేర్కొంది. అయితే మధుమేహం అనేది ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది.

ఏమాత్రం షుగర్ లెవెల్స్ పెరిగినా కిడ్నీ డ్యామేజ్ కి, కంటి సమస్యలకు, నరాలు దెబ్బ తినటం అలాగే ముఖ్యంగా గుండెపోటు కి దారితీస్తుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ విషయంలో అసలు అశ్రద్ధ చేయకండి. అలాగే పూర్తిగా మందుల మీద ఆధారపడకుండా కొన్ని చిట్కాలు ద్వారా కూడా షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. నోటికి రుచిగా ఉంది కదా అని ప్రతీ పదార్థం కడుపులో వేసేస్తే అది షుగర్ లెవెల్స్ ని అమాంతం పెంచేస్తుంది.

కాబట్టి మీరు తీసుకునే ఫుడ్ లో షుగర్ కంటెంట్ తక్కువగా.. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ప్రిఫర్ చేయాలి. అలాగే నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలాగే జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ బాగా తగ్గించాలి. మీ షుగర్ లెవెల్స్ మీ బరువు మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు బరువు ఎక్కువగా ఉన్నట్లయితే కచ్చితంగా మీ బరువుని తగ్గించుకునే ప్రయత్నం చేయండి.

రోజు గంట సేపు కచ్చితంగా వ్యాయామం చేయాలి. మీరు చేసే వ్యాయామం వలన షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవుతాయి. అలాగే ఒత్తిడిని బాగా తగ్గించుకోవాలి. అందుకోసం యోగ, మెడిటేషన్ వంటివి చేయటం ఉత్తమం. అలాగే షుగర్ ఉన్న వ్యక్తులు కచ్చితంగా రోజుకి 8 గంటలు నిద్ర పోవాల్సిందే. ప్రశాంతమైన నిద్ర ఒక మనిషికి ఎన్నో రోగాలని దూరం చేస్తుంది.

కాబట్టి పడుకునే ముందు గోరు వెచ్చని పాలు తాగటం, తేలికపాటి నడక మంచి నిద్రకి ఎంతో అవసరం. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని గ్రహించండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker