చంద్రబాబు తరుపున వాదించే లాయర్ కి రోజుకి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా..?
స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉంది అని తెలిపింది. చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బులు రిలీజ్ అయ్యాయి అంది. ఈ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంతో సీఐడీ మెమో దాఖలు చేసింది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏసీబీ కోర్టు దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.
అయితే భారత్‌లో ప్రముఖ లాయర్లలో సిద్ధార్థ్ లూథ్రా ఒకరు. టాప్ 10 లాయర్ల జాబితాలో ఆయనొకరు. న్యాయ నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఒక్క పర్యాయం కోర్టులో అటెండ్ అవ్వడానికి ఆయన రూ. 5 లక్షలు ఛార్జ్ చేస్తారు. రవాణా ఖర్చులు, బస, ఇతర సదుపాయాలు అదనం.
కేసును బట్టి గంటకు రూ. 15 లక్షల వరకూ ఛార్జ్ చేసే లాయర్లు కూడా భారత్‌లో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. సిద్ధార్థ్ లూథ్రా తండ్రి కె.కె. లూథ్రా కూడా న్యాయవాదిగా పనిచేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ, డిల్లీ యూనివర్సిటీల నుంచి సిద్ధార్థ్ లూథ్రా.. న్యాయశాస్త్రంలో పట్టాలు అందుకున్నారు. 1990లో LLB పూర్తి చేశారు.
రాజ్యాంగ చట్టాలు, మానవ హక్కులు, ఇతర న్యాయ సంబంధ అంశాలపై సిద్ధార్థ్ లూథ్రా అధ్యయనం చేశారు. ఆయన ప్రతిపాదించిన పలు అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. పలు పుస్తకాలను కూడా రాశారు. భారత్‌తో పాటు ఇతర దేశాల కోర్టుల్లోనూ సేవలు అందించిన అనుభవం సిద్ధార్థ్ లూథ్రాకు ఉంది.
చంద్రబాబు తీరుపై సైతం సీఐడీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కోర్టులో ప్రవేశ పెట్టే సమయంలో జాప్యం జరిగేలా చంద్రబాబు వ్యవహరించారని సీఐడీ ఆరోపించింది. కోర్టుకు వెళ్లే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని సీఐడీ తెలిపింది. 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలనే నియమాన్ని జాప్యం చేసేందుకు చంద్రబాబు యత్నించారని సీఐడీ తెలిపింది.