‘ఐబొమ్మ’ మాస్ వార్నింగ్, వైరలవుతున్న పోస్ట్..!
పైరసీ సైట్స్ అనేవి మొదటి నుంచీ సినిమా ఇండస్ట్రీకి శాపంగానే తయారయ్యాయి. కాకపోతే ఇటీవల కాలంలో టికెట్ రేట్లు పెరగడం, ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ రేట్లు అధికంగా ఉండటంతో మూవీ లవర్స్ ఎక్కువగా ఈ వెబ్ సైట్లను ఆశ్రయిస్తున్నారు. వందల రూపాయలు పెట్టి ఏడాది లేదా నెల సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ఎందుకు, ‘ఐబొమ్మ’లో ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ఉచితంగా దొరుకుతోంది కదా అని ఆలోచిస్తున్నారు.
అయితే తాజాగా ఐ బొమ్మ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ నిర్మాతలకు వార్నింగ్ ఇస్తూ నోట్ విడుదల చేసింది. మా మీద మీరు ఫోకస్ పెడితే.. మేం ఎక్కడ ఏం చేయాలో అక్కడ చేస్తామంటూ హెచ్చరిక చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికైనా మా వెబ్‌సైటు మీద ఫోకస్ చేయడం ఆపండి. లేదంటే మేము మీ మీద ఫోకస్ చేయాల్సింవస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత ఈ పోస్ట్ టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు సినీ ప్రముఖులు ఎవరూ కూడా స్పందించలేదు.
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ నోట్ టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరీ ఈ నోట్‌ను నిజంగానే ఆ సంస్థ విడుదల చేసిందా లేక కావాలని ఎవరైనా ఆ పేరుతో ఇలా అసత్యం ప్రచారం చేస్తున్నారా? అన్న అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు ఓ పైరసీ సైట్ ఇలా నిర్మాతలకు వార్నింగ్ ఇవ్వడమేంటని చర్చించుకుంటున్నారు.
iBOMMA warning to Telugu Film industry 😲🤯 pic.twitter.com/1utGXhlwPt
— 𝙐𝙨𝙩𝙝𝙖𝙖𝙙🔥ᵖˢᵖᵏ𝙘𝙪𝙡𝙩🦅 (@USTHAAD_PK_CULT) September 6, 2023