తొడలు రాసుకుని ఎర్రగా కందిపోతున్నాయా..? ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే సరి!
చాలా మంది స్త్రీపురుషులకు తొడల మధ్య రాపిడి ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా తొడలు ఎర్రగా కందిపోతుంటాయి. ఒకవైపు మంటతో పాటు.. మరోవైపు దురద పుడుతుంది. దీనికి చెమట అధికంగా పోయడం వల్ల కూడా చికాకు పడుతుంటాయి. ఈ కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. అయితే కొందరికి రెండు తొడలు దగ్గరగా ఉంటాయి. అధిక బరువు వల్ల కూడా ఇలా ఉండొచ్చు. ఇలాంటప్పుడు ఎక్కువ దూరం నడిచినా.. అధికంగా చెమట పట్టిన రెండు తొడలు రాసుకుపోయి ఎరుపెక్కి మంట వస్తుంది.
కొందరికి తొడలు రాసుకోవడం వల్ల నల్లగా కూడా ఉంటాయి. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. కలబంద చర్మ సంరక్షణలో బాగా పనిచేస్తుంది. ముఖంపై మొటిమలను తగ్గించడమే కాదు.. చర్మంపై గాయాలు, పుండ్లను కూడా త్వరగా మానేలా చేస్తుంది. కలబంద గుజ్జును కందిన తొడలపై రాస్తూ ఉంటే.. కలబంద.. కలబంద చర్మ సంరక్షణలో బాగా పనిచేస్తుంది. ముఖంపై మొటిమలను తగ్గించడమే కాదు.. చర్మంపై గాయాలు, పుండ్లను కూడా త్వరగా మానేలా చేస్తుంది.
కలబంద గుజ్జును కందిన తొడలపై రాస్తూ ఉంటే.. ఉపశమనం ఉంటుంది. నలుపు కూడా తగ్గుతుంది. కొబ్బరి నూనె.. కొబ్బరినూనెలో చర్మాన్ని సంరక్షించే గుణాలు ఉంటాయి. ఇది వాపుల్ని తగ్గిస్తుంది. తొడలు రాసుకుని ఒరిసిన ప్రాంతంలో కొబ్బరి నూనె రాస్తే.. దాని నుంచి వెంటనే రిలీఫ్ ఉంటుంది. మొక్కజొన్న పిండి: మొక్కజొన్న పిండిని.. తొడలు కందిన చోట పౌడర్ చల్లినట్లు చల్లితే.. ఎక్కువగా చెమట పట్టకుండా ఉంటుంది.
దీనివల్ల పదే పదే తొడలు కందిపోకుండా ఉంటాయి. ఐస్ క్యూబ్స్.. ఐస్ క్యూబ్స్ ను పలుచటి వస్త్రంలో చుట్టి.. దానితో మంట ఉన్న చోట మర్దనా చేస్తున్నట్లు రాస్తే.. 5 నిమిషాల్లో ఉపశమనం పొందవచ్చు. సోడా.. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 3 టేబుల్ స్పూన్ల నీళ్లు, 5 చుక్కల లవంగం నూనెను తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తొడలు రాసుకునే చోట అప్లై చేసి.. 5 నిమిషాల తర్వాత వేడినీటితో కడిగేయాలి.
దీనివల్ల మంట, దురద, నలుపు తగ్గుతాయి. ఆలివ్ ఆయిల్.. కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను తీసుకుని తొడలు రాసుకునే చోట అప్లై చేయాలి. తరచూ ఇలా ఆలివ్ ఆయిల్ రాస్తూ ఉంటే.. తొడలు ఎరుపెక్కకుండా, మంటలేకుండా ఉంటాయి. కాగా శరీరంలో అధిక వేడి ఉన్నా.. తొడల వద్ద మంట వస్తుంటుంది. మజ్జిగ, నిమ్మరసం, సబ్జా నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటే శరీరంలో వేడి తగ్గి మంట తగ్గుతుంది.