గుండెపోటు సమయంలో ఛాతీలో నొప్పి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
శాకాహార ఆహారం అనేక విధాలుగా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మాంసం , పాల వంటి జంతు ఉత్పత్తులలో అధిక స్థాయిలో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ ఉంటాయి, ఇది ధమనులలో ఫలకం పేరుకుపోవడానికి దారితీస్తుంది. శాఖాహార ఆహారాలు సాధారణంగా సంతృప్త కొవ్వులు కొలెస్ట్రాల్‌లో తక్కువగా ఉంటాయి, అయితే గుండెపోటు సమయంలో ఛాతీలో నొప్పి కలకడం దీని సాధారణ లక్షణాలలో ఒకటి. ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపున తేలికపాటి అసౌకర్యంగా ఉంటుంది.
కానీ ఛాతీ ఎడమ వైపు భాగంలో నొప్పి ఉంటే మాత్రం భయపడాల్సిన పనిలేదు. ఛాతీ ఎడమ వైపున వచ్చే నొప్పి గుండెపోటు అని చాలా మంది నమ్ముతారు. గుండెపోటు వల్ల ఛాతీలో నొప్పి కలగడమే కాకుండా.. ఛాతీ బరువుగా అనిపిపిస్తుంది. దీనివల్ల అకస్మాత్తుగా ఛాతీపై విపరీతమైన ఒత్తిడి కలిగినట్టుగా అనిపిస్తుంది. అలాగే కడుపు టైట్ గా అనిపించడం, తట్టుకోలేని నొప్పి ఆ వ్యక్తిని అసౌకర్యానికి గురిచేస్తాయి. చాలా సందర్భంలో ఛాతీలో మండుతున్న అనుభూతి కూడా కలుగుతుంది.
గుండెపోటును గురించి మరొక సంకేతం .. ఒక దగ్గర మొదలైన నొప్పి మరిన్ని అవయవాలకు వ్యాపించడం. గుండెపోటు వల్ల కలిగిన నొప్పి సాధారణంగా ఛాతీలో ప్రారంభమవుతుంది. అలాగే మెడ, వెనుక భాగం, చేతులు, భుజాలకు వ్యాపిస్తుంది. గుండెపోటు సమయంలో దవడల్లో కూడా నొప్పి కలుగుతుంది. గుండెపోటు వల్ల వచ్చే నొప్పి కేవలం కొన్ని నిమిషాల పాటు ఉంటుంది. చాలా సందర్భాల్లో.. దానంతట అదే తగ్గిపోయి మళ్లీ వస్తుంది.
ఛాతీ ఎడమ వైపున నొప్పి లేదా బరువు పెట్టినట్టుగా అనిపిస్తే మీరు వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి. గుండెపోటు సమయంలో.. ఛాతీ నొప్పి అనేక ఇతర సమస్యలతో ముడిపడి ఉంటుంది. వ్యక్తి ఛాతీలో ఒత్తిడి లేదా నలిగిపోతున్న అనుభూతితో పాటు శ్వాస ఆడకపోవడం, చెమట పట్టడం, వికారం లేదా వాంతులు వంటి సంకేతాలను గమనించాలి. నమ్మకూడని కొన్ని అపోహలు..నేను చాలా చిన్నవాడిని. నాకు గుండెపోటు రానేరాదు.
మా కుటుంబంలో ఎవరికీ గుండెపోటు రాలేదు. కాబట్టి నాకు కూడా రాదు. ఇలాంటి అపోహలను ఎప్పటికీ నమ్మకండి. ఎందుకంటే ఈ రోజుల్లో యువతకు కూడా హార్ట్ ఎటాక్ వస్తోంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం వంటి అనేక ప్రమాద కారకాలు గుండె సమస్యలను కలిగిస్తాయి. వీలైనంత త్వరగా హాస్పటల్ కు వెళితే మీరు ప్రాణాలను కాపాడుకోవచ్చు.