నిద్రలో మీకు అలాంటి కలలు వస్తున్నాయా..! అయితే మీకు తొందరలోనే..?
మీకు వచ్చే కలలు మీకు భవిషత్తులో జరగబోయే సంఘటనలకు సూచిక అని స్వప్నశాస్త్రం చెబుతోంది. స్వప్నశాస్త్రం అనేది నిద్రలో వచ్చే కలల గురించి వివరించే ఒక గ్రంథం. ఇందులో ప్రతీ కలకు ఒక అర్థాన్ని చెబుతుంది. అయితే చాలా మందికి నిద్రలో కలలు వస్తాయి. కొంతమందికి అందమైన కలలు వస్తే, మరికొంత మందికి భయంకరమైన కలలు వస్తాయి. వీటినే చెడు కలలు లేదా పీడకలలు అని కూడా అంటారు. ఇంతకీ ఈ కలలు ఎందుకు వస్తాయి, అసలు కలలు అంటే ఏమిటి? పరిశోధకులు వ్యక్తులకు వచ్చే భిన్నమైన కలలపై రీసెర్చ్ చేశారు. కలలు రావడం అనేది ఏదైనా అంతర్లీనమైన వ్యాధి కానప్పటికీ, వివిధ కారణాలైతే ఉన్నాయి.
కలలు వాస్తవానికి యాదృచ్ఛికమైన ఆలోచనలు అని శాస్త్రవేత్తలు నమ్ముతారు. యాక్టివేషన్ సింథసిస్ మోడల్ ఆధారంగా, మన మెదడులో కార్యాచరణను అర్థం చేసుకోవడానికి కలలు ఒక మార్గం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. మన మెదడు, మెదడులోనే ఉండేటువంటి అమిగ్డాలా, హిప్పోకాంపస్ వంటి భాగాల నుండి సంకేతాలను గ్రహిస్తుంది. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, ఫలితంగా కలలు వస్తాయి. మెమొరీలో స్టోర్ అయినటువంటి జ్ఞాపకాలు, అనుభవాలు మిళితమై కలలుగా ఉద్భవిస్తాయి.
నిద్ర సమయం మించిపోయినపుడు మనల్ని నిద్రపుచేందుకు మెదడు చేసే ఒక మాయ ఈ కల. వ్యక్తిగత అనుభవాలు లేదా మందుల దుష్ప్రభావాలు మొదలైన కారణాలతో కలలు కలగుతాయి. చిన్న పిల్లలలో అయితే, ఇది వారి ఎదుగుదల ప్రక్రియలో ఒక సాధారణ దశ. భయానక చిత్రాలు చూడటం, హారర్ స్టోరీలు వినటం లేదా పుస్తకాలు చదవడం, భయపెట్టే అనుభవాల కారణంగా పీడకలలు వస్తాయి. పీడకలలు రావటం మంచిదేనా..మీకు తరచుగా రాత్రిపూట భయంకరమైన కలలు వస్తున్నాయా? దీని గురించి బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు.
నిత్యం పీడకలలు వచ్చే మధ్య వయస్కుల్లో, వయసు పెరిగే కొద్దీ డిమెన్షియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వారి అధ్యయనంలో తేలింది. ఈ సమస్య వలన మతిమరుపు పెరుగుతుంది. స్పష్టంగా ఆలోచించలేకపోవటం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేకపోవటం, తరచూ గందరగోళానికి గురయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. సింపుల్గా చెప్పాలంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్లు. ఇది వ్యక్తులకు తమ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించుకోవడాన్ని కష్టతరం చేస్తుంది.
పీడకలలు వ్యక్తుల జీవన నాణ్యతపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. మీరు నిద్రలో తరచుగా పీడకలలను అనుభవిస్తే వైద్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం. పీడకలల వల్ల నిద్ర లేమి, గుండె జబ్బులు, డిప్రెషన్, ఊబకాయంతో సహా అనేక అనారోగ్య పరిస్థితులకు కారణమవుతుంది. వైద్యుల సలహాలను పాటిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన నిద్రా ప్రణాళికను అనుసరించడం ద్వారా పరిస్థితిని నియంత్రణలోకి తీసుకురావచ్చు.