డబ్బులు ఖర్చు లేకుండా ఈ చిట్కాతో రాలిపోయిన మీ జుట్టు మళ్ళీ వస్తుంది.
మానవులలో, కొన్ని జంతువులలో తలపై సహజముగా పెరిగే వెంట్రుకలు ఒక వయస్సు వచ్చిన తర్వాత క్రమంగా రాలిపోయి బట్టతల అనే వ్యాధికి దారితీస్తాయి. పురుషుల్లో బట్టతల ఆరంభం కావడానికి భూమి ఆకర్షణ శక్తి కూడా కారణం అయ్యే అవకాశముందని, దీనికితోడు టెస్టోస్టిరాన్‌లో మార్పులు కూడా కారణమని అమెరికా పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. అయితే బట్టతలతో చాలామంది బాధపడుతూ ఉంటారు.
బట్టతలతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నట్లయితే ఇలా చేయండి ఇలా సులభంగా బట్టతల సమస్యకు చెక్ పెట్టొచ్చు. బట్టతలతో బాధపడే వాళ్ళు ఇలా చేస్తే సులభంగా సమస్య నుండి బయటపడడానికి అవుతుంది. చాలామంది బట్టతల హెయిర్ లాస్ మొదలైన వాటికోసం పెద్ద పెద్ద క్లినిక్స్ కి వెళ్తూ ఉంటారు కానీ దాని వలన ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కానీ నేచురల్ పద్ధతిలో మనం ఎటువంటి సమస్యలకి చెక్ పెట్టొచ్చు. జామ ఆకులు బట్టతల కి బాగా పనిచేస్తాయి నిజానికి జుట్టుకి దివ్య ఔషధం ఇవి. కొన్ని జామాకులను తీసుకుని నీళ్లలో బాగా మరిగించి చల్లారిన తర్వాత జుట్టుకు బాగా పట్టించి 10 నిమిషాలు పాటు మసాజ్ చేయండి. నాలుగు నుండి ఐదు గంటల పాటు అలా వదిలేసి తల స్నానం చేస్తే చక్కటి ఫలితం కనబడుతుంది.
లేదంటే రాత్రి తలకు పట్టించి టవల్ తలకి చుట్టుకుని ఉదయం లేచి మీరు హెయిర్ వాష్ చేసుకున్నా సరిపోతుంది ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండా సులభంగా బట్టతల సమస్యకు ఈ విధంగా చెక్ పెట్టొచ్చు. జుట్టు రాలిపోకుండా ఉండాలంటే తల ఎప్పుడు పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి.
జుట్టుని దువ్వేటప్పుడు వెడల్పు దువ్వెనతో దువ్వండి ఇలా చేయడం వలన జుట్టు రాలిపోకుండా ఉంటుంది ఇలా బట్టతల సమస్యతో బాధపడే వాళ్ళు ఆ సమస్య నుండి బయట పడొచ్చు వాళ్ళ యొక్క అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.