కంటి చూపు తగ్గుతోందా..! మీరు వెంటనే ఏం చెయ్యాలో తెలుసా..?
నేటి కాలంలో ఐదు సంవత్సరాల పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా కంటిచూపు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. అందుకు కారణం చిన్నపిల్లలైతే మరీ ఎక్కువగా సెల్ ఫోన్స్ చూడడం , టీవీ లాంటివి ఎక్కువగా చూడడం వల్ల తమ కంటి చూపును తగ్గించుకుంటున్నారు. ఇక తీసుకునే ఆహారంలో తగినన్ని పోషకాల లోపం వల్ల కూడా కంటి చూపు మందగిస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే.
అయితే ఎప్పుడు చూసినా కంప్యూటర్ ముందు ఫోన్ల ముందే కూర్చుంటున్నారు దాంతో కచ్చితంగా కంటి చూపు తగ్గుతుంది. ముఖ్యంగా యువకులు ఈ రోజుల్లో ఎక్కువగా డిజిటల్ స్క్రీన్ మీద గడపాల్సి వస్తుంది దీంతో కంటి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. కంటి చూపు సన్నగిల్లడం వంటి సమస్యలు మొదలు కంటే సమస్యలు ఎన్నో దారితీస్తున్నాయి.
అయితే అలా కాకుండా కంటి ఆరోగ్యంగా కళ్ళు ఆరోగ్యం గా ఉండాలంటే ఈ చిట్కాలని పాటించండి. ఇలా చేస్తే కళ్ళు బాగా కనిపిస్తాయి పైగా కంటి సమస్యలు రావు ఆరోగ్యం బాగుండాలంటే మొదట ఆహారం బాగుండాలి పోషకాలు కుడిన ఆహార పదార్థాలని డైట్ లో చేర్చండి. పాలకూర క్యారెట్ ఆకుకూరలు వంటివి డైట్లో చేర్చుకుంటే కళ్ళు బాగా కనపడతాయి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను మీరు డైట్ లో చేర్చుకుంటే కచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది.
స్మోకింగ్ వలన కూడా కంటి చూపు దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఈ అలవాటు ఉంటే మానుకోండి స్మోకింగ్ వలన వివిధ రకాల సమస్యలు కలుగుతాయి. ఎండ తీవ్రత పెరగడం వలన కూడా కంటి ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది కళ్ళు బాగా కనపడాలంటే ఎండలో ఎక్కువసేపు తిరగకండి. హానికరమైన యువీ కిరణాల నుండి రక్షణ కలిగేందుకు సన్ గ్లాసెస్ ధరించండి.
ఎక్కువసేపు అదే పనిగా స్క్రీన్ ని చూడకుండా స్క్రీన్ బ్రేక్ తీసుకోండి మధ్యమధ్యలో పని నుండి గ్యాప్ తీసుకుంటే కళ్ళు బాగా కనబడతాయి. కంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు అదేవిధంగా మంచి నిద్రని పొందండి. రోజు మంచిగా నిద్రపోతే కూడా కంటికి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు కంటి సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు.