Health

మద్యం తాగే ఆడవారికి పిల్లలు పుట్టరా..? అసలు విషయాలు తెలిస్తే..?

మద్యపానం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు ఎప్పట్నుంచో చెప్తున్నారు. దాని వల్ల కాలేయం, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని ఇప్పటి వరకూ చెప్పారు. ఇప్పుడు కొత్తగా.. మద్యపానం ప్రభావం సంతానంపై కూడా పడుతుందని చెప్తున్నారు పరిశోధకులు. చేన్నైలోని చెట్టినాడ్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, చెట్టినాడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేసిన ఓ అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం వెల్లడైంది.

అయితే నేడు ఆడ మగ అన్న తేడా లేకుండా ఎవరికీ వారు ఇష్టం వచ్చినట్లు మద్యం తీసుకుంటున్నారు. అయితే మగవారు ఎక్కువగా తీసుకుంటారన్న విషయం తెలిసిందే, కానీ కొందరు మహిళలు సైతం మద్యం తీసుకుంటారని సర్వేలు చెబుతున్నాయి. కాగా ఇలాంటి మద్యం తాగే ఆడవారి గురించిన ఒక విషయం గురించి ఇప్పుడు చూద్దాం.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆడవారు మద్యం తాగితే.. పిల్లలు పుట్టరు అన్న సందేహం చాలా మందిలో ఉంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవంగా ఆడవారు మద్యాన్ని తాగితే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ లపై విపరీతమైన ప్రభావం పడుతుందట.

ఇది మహిళలలో గర్భధారణ సామర్ధ్యాన్ని తగ్గిస్తుందని గైనకాలజిస్ట్ లు సలహాలు ఇస్తున్నారు. ఇంకా తక్కువగా మద్యం తీసుకునే వారికి ఏమీ ఇబ్బంది ఉండదని… ఒక వారంలో 14 సార్లు మద్యం తీసుకుంటే వారిలో 25 శాతం గర్భం ధరించే అవకాశాలు తగ్గిపోతాయట.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker