Health

దయచేసి గమనించండి మీ చేతి గోర్లు ఇలా ఉంటే మీకు కష్టాలు తప్పవు.

అందరి చేతులకు ఉన్న గోళ్లు అన్ని ఒకేలాగా ఉండాలని లేదు.కొందరి గోళ్ల మీద తెల్ల గీతలు ఉంటే మరికొందరు గోళ్లు తెల్లగా పాలిపోయినట్టు ఉంటాయి.అయితే మనఅందరి చేతి గోళ్ల మీద అర్ధచంద్రాకారంలో ఒక ఆకారం ఉంటుంది దానిని ఎప్పుడన్నా గమనించారా..దానిని లునులా అని అంటారు. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషక పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి.

కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మొదలు అన్ని పోషక పదార్థాలు కూడా బాడీ లోకి వెళ్ళాలి. పోషక పదార్థాలు సరిగా తీసుకోక పోయినప్పుడు ఏదైనా పోషకాహార లోపం కలిగినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాలి. అయితే చాలా మంది ప్రోటీన్స్ ని తక్కువ తీసుకుంటుంటారు. అయితే అలా తీసుకోక పోతే ప్రోటీన్ లోపం కూడా కలగచ్చు.

ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నట్లయితే కొన్ని లక్షణాలు కనబడతాయి. ఆ లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం… ప్రోటీన్ లోపం వలన జుట్టు బాగా రాలుతుంది కొత్త జుట్టు మొలవదు. జుట్టు పెరుగుదల కూడా ఆగిపోతుంది. చర్మం బాగా పొడిబారిపోతుంది. ఎక్కువగా చర్మం పై ముడతలు కలుగుతాయి.

చిన్న వయసులోనే పెద్దవారి లాగ కనబడుతుంటారు గోర్ల మీద కూడా మార్పు వస్తుంది. గోర్ల మీద గరుకుగా ఏర్పడుతుంది. గోర్లపైన నిలువుగా గీతలు వస్తాయి నీరసంగా అనిపిస్తూ ఉంటుంది చిన్న పని చేసిన కూడా అలసట ఎక్కువగా ఉంటుంది.

ప్రోటీన్ లోపిస్తే గాయాలు దెబ్బలు ఎక్కువ కాలం ఉండిపోతాయి. త్వరగా మానవు శరీరం డిటాక్సిఫికేషన్ కూడా స్లో అయిపోతుంది శరీరం క్లీన్ చేసుకోవడానికి ఎన్నో హార్మోన్లు ఎంజైమ్స్ అమైనో యాసిడ్స్ కావాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker