బొల్లి వారసత్వంగా వస్తుందా..? అసలు విషయమేంటంటే..?
తెల్ల మచ్చలు మానవులలో ల్యూకోడెర్మా లేదా విటిలిగో వ్యాధుల వలన ఏర్పడతాయి.ఆయుర్వేద పరిభాషలో శ్విత్రం అని పిలిచే ఈ తెల్ల మచ్చల వ్యాధిని ఆధునిక వైద్యులు ల్యూకోడర్మాగానూ విటిలిగో గానూ పిలుస్తారు. ఇది శరీర అంత ర్భాగాల్లో ఏమాత్రం దుష్ప్రభావం చూపకుండా కేవలం చర్మం మీదే వ్యాపించే వ్యాధి. ఇది మెలినోసైడ్స్లో ఏర్పడిన కొన్నిలోపాల వల్ల ఏర్పడే సమస్య.
మెలినోసైడ్స్ దెబ్బ తినడం వల్ల చర్మానికి ప్రాణమైన మెలినిన్ తయారు కాదు. దాని ఫలితమే తెల్ల మచ్చలు లేదా ల్యూకోడెర్మా/ విటిలిగో సమస్య. అయితే చాలా మంది బొల్లి వలన ఇబ్బంది పడుతుంటారు. బొల్లి గురించి చాలా మందికి పెద్దగా అవగాహనా లేదు. పైగా ఎవరికైనా బొల్లి కనుక ఉంటే అది స్ప్రెడ్ అయిపోతుంది ఏమో అని భయ పడుతూ వుంటారు.
ఈ బొల్లి మచ్చలు అనేది ఒక చర్మ రోగం. ఎంతో మందిలో ఇది కనపడుతూ ఉంటుంది సాధారణంగా చర్మానికి భిన్నంగా బొల్లి మచ్చలు తెలుపు రంగు లో ఉంటూ ఉంటాయి మెలనిన్ అనేది చర్మం, జుట్టు, కళ్ళకు కలర్ ని ఇచ్చే ఒక హార్మోన్. ఈ మెలనిన్ ఉత్పత్తికి కారణమయ్యే కణాలైన మెలనోసైట్స్ నాశనమైనప్పుడు ఇలాంటి సమస్య కలుగుతుంది.
ఈ కణాలు నాశనమైన ప్రాంతాల్లో ఇలా తెల్లని మచ్చలు లాగ వస్తాయి దీనినే బొల్లి మచ్చలు అంటారు. ఇది జుట్టును కూడా ప్రభావం చేస్తుంది జుట్టు రంగు కూడా తెల్లగా లేదంటే బూడిద రంగు లోకి వస్తుంది అయితే ఈ బొల్లి సమస్య ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది అనేది సరిగ్గా చెప్పలేము. కానీ వారసత్వంగా మాత్రం రాదు.
అయితే థైరాయిడ్ వ్యాధి లేదంటే టైప్ 2 డయాబెటిస్ వంటి ఆటో ఇమ్యూన్ సమస్యలు ఉన్నప్పుడు బొల్లి వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమస్యకి అసలు చికిత్స కూడా లేదు.