Health

ఈ పొడిని రోజు 1 స్పూన్ తీసుకుంటే చాలు,మీకు జీవితంలో గుండెపోటు రాదు.

గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసంగాను, గుండెలో నొప్పి, పట్టేసినట్లు ఉండడం జరుగుతుంది. ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాన్ని బట్టి బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టి చేస్తారు, అయితే గుండె నుంచి మ‌న శ‌రీర అవ‌య‌వాల‌కు ర‌క్తం స‌ర‌ఫ‌రా అవుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ర‌క్త‌నాళాలు స‌హ‌జంగానే సాగే గుణాన్ని క‌లిగి ఉంటాయి.

దీని వ‌ల్ల ర‌క్తం సుల‌భంగా స‌ర‌ఫ‌రా అవుతుంది. ఎలాంటి ఆటంకం ఏర్ప‌డ‌దు. కానీ కొంద‌రిలో ర‌క్త‌నాళాలు సాగే గుణాన్ని కోల్పోతాయి. గ‌ట్టిగా మారుతాయి. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంది. ఫ‌లితంగా గుండెపై పీడ‌నం, ఒత్తిడి ప‌డ‌తాయి. దీంతో గుండెపై భారం పెరిగిపోతుంది. దీర్ఘ‌కాలికంగా ఇది గుండె కండ‌రాల‌ను లేదా ర‌క్త‌నాళాల‌ను దెబ్బ తీస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. ఇలా హార్ట్ ఎటాక్‌లు చాలా మందికి వ‌స్తున్నాయి. కానీ హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసేందుకు ఒక అద్భుత‌మైన ఆహారం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని సైంటిస్టులు తేల్చారు.

అది ఏమిటంటే.. అవిసె గింజ‌లు. అవును.. అవే. వీటి గురించి చాలా మందికి తెలియ‌దు. తెలిసిన వారు కూడా వీటిని తినాలంటే అంత‌గా ఆస‌క్తిని చూపించ‌రు. కానీ అవిసె గింజ‌ల‌ను రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే ర‌క్త నాళాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయ‌ని త‌ద్వారా ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఎలాంటి ఆటంకాలు ఏర్ప‌డ‌వ‌ని, దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా నిరోధించ‌వ‌చ్చ‌ని.. సైంటిస్టులు త‌మ ప‌రిశోధ‌న‌ల్లో తేల్చారు.

హార్వార్డ్ విశ్వ‌విద్యాల‌య ప‌రిశోధ‌కులు దీనిపై ప‌లు ప‌త్రాల‌ను కూడా ప్ర‌చురించారు. అందువ‌ల్ల అవిసె గింజ‌ల‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే త‌ద్వారా గుండె పోటు రాకుండా చూసుకోవ‌చ్చు. ఇక అవిసె గింజ‌ల‌ను నేరుగా తిన‌లేని వారు వాటిని కాస్త పెనంపై వేయించి తిన‌వ‌చ్చు. అవ‌స‌రం అయితే ఈ గింజ‌ల‌ను పొడి చేసి వాటిని ఖ‌ర్జూరాలు, తేనెతో క‌లిపి తిన‌వ‌చ్చు. వాటితో ల‌డ్డూల‌ను చేసుకుని రోజుకు ఒక‌టి తిన‌వ‌చ్చు.

లేదా అవిసె గింజ‌ల పొడిని రోజుకు ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవ‌చ్చు. దీన్ని నిత్యం మ‌నం తినే కూర‌ల్లో క‌లిపి వాడుకోవ‌చ్చు. లేదా ప‌ళ్ల ర‌సాలు, స్మూతీలు, మిల్క్ షేక్‌లు, స‌లాడ్స్‌లోనూ క‌లిపి అవిసె గింజ‌ల పొడిని తీసుకోవ‌చ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా ముందుగానే నివారించ‌వ‌చ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker