వీటిని రోజూ కొంచం తింటే చాలు, శరీరానికి రక్తమే రక్తం, మలబద్దకం కూడా తగ్గిపోతుంది.
ప్రతిరోజు గుప్పెడు శనగలను తినటం ద్వారా చిన్నచిన్న ఆరోగ్యసమస్యలు తలెత్తకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. శనగల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు శనగల ద్వారా మనకు సుమారుగా 474 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. పొటాషియం మన శరీరంలో బీపీని నియంత్రిస్తుంది. గుండె సమస్యలు రాకుండా చూస్తుంది. అందువల్ల నిత్యం శనగలను తింటే హైబీపీ తగ్గుతుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. సూపర్ రిచ్ ప్రోటీన్,విటమిన్స్,మినరల్స్,ఫైబర్ పుష్కలంగా వున్నా శనగలతో జీర్ణం కూడా బాగా అవుతుంది. అయితే శనగలలో అనేక పోషకాలు ఉంటాయి.
ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్ బి6, సి, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం తదితర పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మనకు పోషణను అందిస్తాయి. అనారోగ్యాలను నయం చేస్తాయి. దీంతోపాటు పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం ఉండదు. కాస్త వీటిని తినగానే కడుపు నిండిపోతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది. శనగల్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.
అందువల్ల మాంసాహారం తినలేని వారు శనగలను తింటే ప్రోటీన్లను బాగా పొందవచ్చు. ప్రోటీన్లు కండరాల మరమ్మత్తులకు, ఎదుగుదలకు దోహదపడతాయి. కనుక శనగలను తింటే శాకాహారులకు ఎంతగానో మేలు జరుగుతుంది. శనగల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ కూడా తక్కువే. అందువల్ల వీటిని తిన్న వెంటనే షుగర్ లెవల్స్ పెరగవు. ఇది షుగర్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇక శనగలను రోజూ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది.
మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శనగలు తక్కువ జీఐ విలువను కలిగి ఉంటాయి కనుక షుగర్ ఉన్నవారు వీటిని నిర్భయంగా తినవచ్చు. ఇవి షుగర్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. శనగల్లో ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి.
దీంతో క్యాన్సర్ రాదు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శనగలను తినడం వల్ల కాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. దీని వల్ల వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఇక నల్ల శనగలు అయితే ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కనుక వీటిని తింటే రక్తం బాగా పడుతుంది. దీంతో రక్తహీనత సమస్య తగ్గుతుంది.