ఈ గింజలు తింటే రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
ఈ కాలంలో సజ్జలతో రోటీ లేదా ఖిచ్డీని చాలామంది ఇష్టంగా చేసుకోని తింటుంటారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ మిల్లెట్ తినడం వల్ల మెటబాలిజం బాగా జరిగి ఊబకాయం తగ్గుతుందని చెబుతున్నారు. దీంతోపాటు మిల్లెట్ తినడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు దాగున్నాయని. అందుకే ఆహారంలో తృణధాన్యాలను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ రోజుల్లో చాలా మంది బియ్యం తినడానికే అలవాటు పడుతున్నారు. ఫలితంగా రోగాల బారిన పడుతున్నారు. అయినా అన్నం మాత్రం మానడం లేదు.
అన్నం తినడం వల్లే రోగాలు వస్తున్నాయనేది వాస్తవం. అన్నం తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె జబ్బుల ముప్పు ఏర్పడుతుంది. మన పూర్వీకులు జొన్నలు, రాగులు, సజ్జలు వంటి చిరు ధాన్యాలు ఎక్కువగా తినడం వల్ల వారికి ఎలాంటి రోగాలు లేకుండా ఉన్నారు. ప్రస్తుతం అన్నం వల్ల వాటిని పక్కన పెట్టాం. బియ్యం వల్ల ఏ నష్టాలు వస్తాయి. బియ్యం తినడం వల్ల మన శరీరంలో చాలా రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. గుండె జబ్బుల సమస్య ముఖ్యమైనది.
రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె పనితీరు మందగిస్తుంది. ఫలితంగా హార్ట్ స్ర్టోక్ సమస్య వచ్చే అవకాశముంటుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే అన్నంకు బదులు చిరుధాన్యాలు తినడం మంచిది. ఇందులో సజ్జలు తింటే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎలా తినొచ్చు.. సజ్జలను అన్నం, రొట్టెలు చేసుకోవడం ద్వారా తినొచ్చు. వీటిని తింటే కొవ్వు బయటకు పోయేలా చేస్తాయి. ఇందులో ఉండే ఫైటో కెమికల్ రక్తనాళాల్లో కొవ్వును దరిచేరనివ్వదు.
బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటివి రాకుండా నిరోధిస్తాయి. సజ్జలను ఆహారంగా తీసుకుంటే మన ఆయుష్షును పెంచుతాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం జీవించేందుకు ఆస్కారం ఉంటుంది. జీర్ణక్రియ.. సజ్జలు జీర్ణక్రియ మెరుగుగా ఉండేందుకు తోడ్పడతాయి. ఇందులో ఉండే ఫైబర్ వల్ల అజీర్తి సమస్య రాదు. అధిక బరువును కూడా ఇవి నియింత్రిస్తాయి. మధుమేహులకు బాగా ఉపయోగపడతాయి. వీటిని రవ్వగా కూడా చేసుకుని తినొచ్చు.
ఏ రూపంలో తిన్నా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆహారాల్లో ఇవి ప్రధానమైనవి. సంకటిగా కూడా చేసుకుని తినవచ్చు. డయాబెటిస్ కు..మధుమేహానికి మంచి మందులా ఉపయోగపడతాయి. సజ్జలను మన ఆహారంలో భాగంగా చేసుకుంటే వచ్చే ఫలితాలు మనకు కనిపిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది. షుగర్ వ్యాది లక్షణాలు దాదాపు తగ్గుతాయి. సజ్జలు తినడం వల్ల ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఇలా ఇవి మన జీవితంలో ఎదురయ్యే అనారోగ్యాలను దూరం చేయడంలో ముందుంటాయి.