ఉదయాన్నే భార్య తన భర్తతో కలిసి ఈ పనులు ఖచ్చితంగా చెయ్యాలి : చాణక్యుడు
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలోని ఒక శ్లోకంలో ఇలా చెప్పాడు. మరో దేశం రాజు మన దేశపు రాజు కంటే శక్తిమంతుడై ఉండి, మన దేశంపై దాడి చేసినప్పుడు, అతని సైన్యం మన దేశం సైన్యం కంటే రెండింతలు శక్తిమంతంగా కనిపిస్తే, మనం వెంటనే దేశం నుంచి పారిపోవాలి. ఒక దేశంపై దాడి జరిగినప్పుడు, అక్కడ నివసించే ప్రజలు తరచుగా దాని ప్రభావాలను అనుభవిస్తారు. ఆర్థిక అవరోధాలు, ఆహార కొరతను ఎదుర్కొంటారు. అయితే ఆచార్య చాణక్యుడు వైవాహిక జీవితం సంతోషంగా ఉండటానికి అనేక సలహాలు ఇచ్చాడు.
చాణక్యుడు తన చాణక్య నీతిలో మానవ జీవితాన్ని సరళంగా, విజయవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలను పేర్కొన్నాడు. ఈ సూచనలను పాటించడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మన చుట్టూ సానుకూల శక్తి ఉన్నప్పుడు మన జీవితం ఆనందంగా మారుతుంది. ఏ రోజైనా విజయవంతంగా, సంతోషంగా ఉండాలంటే ఉదయం సమయం చాలా ముఖ్యం.
చాణక్యుడు ప్రకారం, ఒక స్త్రీ ఉదయమే లేచి తన భర్తతో కలిసి కొన్ని పనులు చేస్తే, వారి సంబంధం చాలా బలంగా మారుతుంది. శ్రేయస్సు, అదృష్టం మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. చాణక్య నీతి ప్రకారం, ప్రతిరోజూ ఉదయం భార్యాభర్తలు కలిసి చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. భార్యాభర్తలు కలిసి ఉదయాన్నే యోగా చేస్తే ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. మీ శరీరం, ఆరోగ్యం ఎప్పటికీ మెరుగ్గా ఉంటుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీ చుట్టూ సానుకూల శక్తిని సృష్టిస్తుంది.
దీని వల్ల దంపతుల మధ్య గొడవలు ఉండవు. ఇది మీ రోజును చక్కగా ప్రారంభిస్తుంది. ఇద్దరూ కలిసి యోగా చేస్తే.. మానసికంగానూ బలంగా ఉంటారు. భార్యాభర్తలు ప్రేమతో రోజుని ప్రారంభిస్తే రోజంతా ఉల్లాసంగా ఉంటారు. మీరు రోజంతా ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు. పనులన్నీ మరింత శక్తితో చేయవచ్చు. ఉదయం.. భార్యాభర్తలు ఇద్దరూ ఉండే విధానం రోజు మీద ప్రభావం చూపిస్తుంది. మీ సంబంధంలో ప్రేమ, నమ్మకం పెరుగుతుంది. కాబట్టి భార్యాభర్తలు ఉదయం నిద్రలేచిన తర్వాత ప్రేమించుకోవాలి.
ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ లేవండి. భగవంతుని ఆశీర్వాదంతో రోజు ప్రారంభమైతే చాలా మంచిది. పూజతో రోజును ప్రారంభించడం పవిత్రమైనది. ఇది రోజుకు మంచి ప్రారంభాన్ని ఇస్తుంది. దీని ద్వారా మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. కాబట్టి భార్యాభర్తలు ఉదయాన్నే భగవంతుని పూజించాలి. ఇది మీ జీవితంలో అదృష్టాన్ని తెస్తుంది.