Health

ప్లేట్ లెట్స్ తగ్గిపోతున్నయా..? టెన్షన్‌ పడకుండా వీటిని తింటే వేగంగా పెరుగుతాయి.

ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి. ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంబంధించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి. ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం. మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. అయితే కొంతమందిలో ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి.

ప్లేట్లెట్స్ కనుక తగ్గిపోయాయి అంటే ఈ ఆహార పదార్థాలను తీసుకోండి. ఈ ఆహార పదార్థాలను కనుక మీరు డైట్ లో చేర్చుకుంటే ఖచ్చితంగా ప్లేట్లెట్స్ పెరుగుతాయి. సీజన్ మారేటప్పుడు చాలా మంది వైరల్ ఫీవర్స్ తో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు రక్తం లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది ప్లేట్లెట్ కౌంట్ పెంచుకోవడానికి మందులు వాడుతూ ఉంటారు అయితే ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే ప్లేట్లెట్స్ కౌంట్ త్వరగా పెరుగుతుంది.

గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది విటమిన్ ఈ కంటెంట్ ఇందులో ఎక్కువ ఉంటుంది. గుమ్మడికాయ ప్లేట్లెట్ కౌంట్ ని వేగంగా పెంచేస్తుంది గుమ్మడికాయ కూర గుమ్మడి గింజలను తీసుకోవడం వంటివి చేస్తే చక్కటి ఫలితాలు పొందవచ్చు. క్యారెట్లని తీసుకొని కూడా మీరు సులభంగా ప్లేట్లెట్ కౌంట్ ని పెంచుకోవచ్చు. దానిమ్మ పండ్లను తీసుకుంటే రక్తహీనత సమస్య నుండి బయటపడొచ్చు. దానిమ్మ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

అలానే దానిమ్మని తీసుకోవడం వలన ప్లేట్లెట్ కౌంట్ కూడా పెరుగుతుంది. గోధుమ గడ్డిని తీసుకుంటే కూడా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది గోధుమ గడ్డితో రసం చేసి అందులో నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే ప్లేట్లెట్ కౌంట్ త్వరగా పెరుగుతుంది. బీట్రూట్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది బీట్రూట్ ని తీసుకుని కూడా మీరు ప్లేట్లెట్ కౌంట్ ని పెంచుకోవచ్చు.

విటమిన్ కే సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా ప్లేట్లెట్ కౌంట్ ని పెంచుకోవచ్చు. గుడ్లు ఆకుకూరలు లివర్ వంటివి కూడా తీసుకోండి. బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకుని కూడా ప్లేట్లెట్ కౌంట్ ని పెంచుకోవచ్చు ఈ ఆకుల రసాన్ని తీసుకుంటే 24 గంటల్లోనే ప్లేట్లెట్ కౌంట్ డబల్ అవుతుంది. పాలు గుడ్లు చీజ్ వంటివి తీసుకొని కూడా మీరు ప్లేట్లెట్ కౌంట్ ని పెంచుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker