News

చనిపోయిన వారిని బతికించే ఆలయం ఇదే, మనం దేశంలో ఎక్కడా ఉందొ తెలుసా..?

భారతదేశంలో జరిగే తంత్ర ప్రక్రియల్లో, శవాలు నడుస్తాయి. గతంలో జరిగాయి, అలాంటివి ఎన్నో సంఘటనలు, ఇప్పటికీ జరుగుతున్నాయి కూడా. కానీ ఎవరైనా చనిపోయారని వైద్యులు చెప్పిన వెంటనే, అతను పూర్తిగా మరణించినట్టు కాదు. మరణం నెమ్మదిగా సంభవిస్తుంది. మీకీ విషయం ఇప్పటి వరకూ తెలియనట్లైతే- ఒక మనిషి చనిపోయిన తరువాత, దాదాపు 14 రోజుల వరకు, గోళ్లు ఇంకా జుట్టు పెరుగుతూనే ఉంటాయి. మరణం మెల్లగా వస్తుంది. అది ఇంకా పూర్తి అవలేదు. అయితే దేవతలు నివసించే రాష్ట్రంగా పేరొందిన ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ జిల్లాలో చౌన్సర్ బావర్ అనే ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది.

లఖమండల్ దేవాలయం చక్రతా నుంచి దాదాపు 107 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం వద్ద పశ్చిమం వైపున ఉన్న రెండు భవనాలు (ద్వారపాలకులు) ఉన్నాయి. ఎవరైనా చివరి ఘడియల్లో ఉన్నప్పుడు లేదా చనిపోయిన వెంటనే.. వారిని ఈ రెండు విగ్రహాల ముందుకు తీసుకువస్తారు. మృతదేహాన్ని ఉంచి, ఆలయ పూజారి శివలింగాన్ని అభిషేకించిన నీటిని తెచ్చి ఆ చివరి ఘడియల్లో ఉన్న వారి శరీరంపై చల్లితే, లేదా చనిపోయిన వ్యక్తి నోట్లో పోస్తే నిమిషాలకే తిరిగి జీవిస్తాడని ఇక్కడి స్థానికులు బలంగా నమ్ముతారు. ఇందుకు ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు చూపిస్తారు.

చనిపోయిన వ్యక్తి, తిరిగి బ్రతికిన తర్వాత శివయ్య పేరుని స్మరిస్తూ.. గంగాజలాన్ని సేవిస్తారు. గంగాజలం సేవించిన తర్వాత.. ఆత్మ మళ్లీ శరీరాన్ని విడిచిపెడుతుంది. ఈ విధంగా చనిపోయిన వ్యక్తి శాశ్వతత్వాన్ని పొందుతాడని విశ్వాసం అంతేకాదు ఈ దేవాలయ సందర్శనం వల్ల దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుందని చెబుతారు. ఈ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద మానవ, దానవ అనే రెండు ఎత్తైన విగ్రహాలున్నాయి.

వీటిని స్థానికులు భీమార్జునులదని చెబుతారు. మరికొందరు విష్ణువు నివశించే వైకుంఠం ద్వారపాలకులైన జయ విజేయులని కూడా అంటారు. ఈ ఆలయం ఉనికికి సంబంధించి పురాణ కథనం ప్రకారం పాండవులు కాలు పెట్టిన పవిత్ర స్థలాల్లో లఖమండల్ మందిరం కూడా ఒకటి. పాండవులు అజ్జాత వాసంలో ఉన్న సమయంలో ఈ లఖమండల్ మందిరంలో కొద్ది రోజుల పాటు గడిపారని చెబుతారు. కౌరవులు పాండవులను సజీవ దహనం చేయాలనీ నిర్ణయించుకున్న లక్క గృహమే ఈ ప్రస్తుత దేవాలయమని భక్తులు నమ్ముతారు.

ఈ అద్భుతమైన దేవాలయం సంబంధించిన మరో ఆశ్చర్యకరమైన వాస్తవం అద్దం లాంటి శివలింగం. ఈ లింగానికి అభిషేకం చేస్తే.. అద్భుతంగా మెరుస్తూ నీరు పోసిన వారి ముఖ ప్రతిబింబం కూడా లింగంపై స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు అభిషేకం చేసిన నీరు రుచి తియ్యగా మారుతుంది. మరొక విశేషం ఏమిటంటే మహాశివరాత్రి నాడు ఆలయంలో రాత్రంతా ఉండి, శివలింగాన్ని చూస్తూ భగవంతుని నామాన్ని జపించిన స్త్రీకి సంతానం కలుగుతుందని విశ్వాసం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker