ఈ టిప్స్ పాటిస్తే అరటి పండ్లు చెడిపోకుండా ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి.
అరటి పండు ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. భారతదేశంలో, మామిడి పండు తరువాత, రెండవ ముఖ్యమైన పండ్ల పండు అరటి, సంవత్సరం పొడవునా లభిస్తుంది, సరసమైన, పోషకమైనది, రుచికరమైనది,ఔషధ విలువలను కలిగి ఉంది, ఇతర దేశాలకు అరటి పళ్లను ఎగుమతి చేయవచ్చును. ప్రపంచవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ రకాల అరటిపండ్లు ఉన్నాయి. అయితే అరటిపండ్లు మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందించే అవసరమైన పోషకాలు, ఎంజైమ్‌లు అందిస్తుంది.
వీటిని ఫ్రెష్‌గా తింటేనే కావాల్సిన పోషకాలు శరీరానికి అందుతాయి. సాధారణంగా అరటి పండ్లు కొని ఇంట్లో తెచ్చి పెట్టుకున్న కొద్ది రోజులకే అవి నల్లబడతాయి. ముఖ్యంగా వేసవికాలంలో అవి వెంటనే తాజాదనాన్ని కోల్పోతాయి. అయితే వీటిని ఫ్రెష్‌గా ఉంచేందుకు ప్రతి పండును వేరు చేసి గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. వాటిని సరిగ్గా నిల్వ చేయాలి. అరటి పండ్లను ఇతర పండ్ల దగ్గర లేదా ప్రత్యక్ష సూర్యకాంతిలో ఉంచకూడదు. ఇంకా వీటిని ఫ్రెష్‌గా ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి.
ప్లాస్టిక్ వ్రాప్.. అరటిపండ్లు పక్వానికి వచ్చే ప్రక్రియను మందగించడానికి, వాటిని తాజాగా ఉంచడానికి, ప్రతి అరటిపండును వేరు చేసి, కాండం చివరను ప్లాస్టిక్‌తో చుట్టాలి. ప్లాస్టిక్ ఇథిలీన్ వాయువు ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వాటి తాజాదనాన్ని 4-5 రోజులు పొడిగిస్తుంది. వేలాడదీయాలి.. గాయాలు, ఆక్సీకరణం, వేగవంతమైన పక్వానికి గురికాకుండా ఉండటానికి అరటిపండ్లను వేలాడదీయాలి.
ఫ్రూట్ షాప్‌లో లాగా అరటి కాండంకు దారం కట్టి వేలాడదీయాలి. ఈ పద్ధతి వల్ల అరటిపండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. గాలి చొరబడని సంచిలో ఉంచాలి.. అరటిపండ్లను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి, వాటిని గాలి చొరబడని ప్లాస్టిక్ సంచిలో ఉంచాలి. వాటిని రిఫ్రిజిరేటర్‌లో ఫ్రీజ్ చేయాలి. ఈ పద్ధతిలో వాటిని ఒక నెల వరకు పాడుకాకుండా స్టోర్ చేయవచ్చు. తినడానికి ముందు, వాటిని సుమారు 30 నిమిషాలు బయట ఉంచాలి.
వెనిగర్‌తో కడగాలి.. అరటి తెగులు రాకుండా వెనిగర్ లిక్విడ్ వాడవచ్చు. కొన్ని టేబుల్ స్పూన్ల వెనిగర్‌తో నీటిని కలపడం ద్వారా వెనిగర్ ద్రావణాన్ని సృష్టించవచ్చు. అరటిపండ్లను ద్రావణంలో ముంచి, వాటిని తీసివేసి, వాటిని వేలాడదీసి కాసేపు ఆరబెట్టాలి. ఈ పద్ధతి అరటి షెల్ఫ్ లైఫ్‌ను పెంచుతుంది. నిమ్మరసాన్ని ఉపయోగించాలి.. నల్లబడటాన్ని నిరోధించడానికి, వాటి తాజాదనాన్ని పెంచడానికి అరటిపండ్ల చివరలకు నిమ్మరసం పూయాలి.