Health

అర్ధరాత్రి దాహం వేస్తుందా..! ఈ ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. జాగర్త.

మన శరీరానికి సరిపడా నీటిని తాగటం వల్ల మనం తీసుకునే ఆహార పదార్థాలు తొందరగా జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో నీరు ఎంతో ఉపయోగపడుతుంది. పదేపదే నీళ్లు తాగాలని కోరిక కలిగితే మీ శరీరంలో కొన్ని అంతర్గత సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇది తరువాత ప్రాణాంతక పరిణామాలను కలిగిస్తుంది. అయితే అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్నప్పుడు కొంతమందికి ఒక్కసారిగా దాహం వేస్తుంది.

నీళ్లు తాగాక కొద్దిసేపటికి మళ్లీ దాహం వేస్తుంది. ఇలా తరచుగా జరుగుతూనే ఉంటుంది. దీంతో నిద్రభంగం జరుగుతుంది. ఇలా జరిగితే అస్సలు తేలికగా తీసుకోవద్దు. ఎందుకుంటే ఇది కొన్నిరకాల వ్యాధుల లక్షణంగా చెప్పవచ్చు. చాలామంది ఎండాకాలం వేడివల్ల ఇలా జరుగుతుందనిఅనుకుంటారు. శరీరంలో బ్లడ్ షుగర్ ఎక్కువైతే శరీర వ్యవస్థ దానిని మూత్రం ద్వారా బయటకు పంపుతుంది.

దీని వల్ల మూత్రం ఎక్కువగా వచ్చి శరీరంలో నీటి కొరత ఏర్పడి తరచుగా దాహం వేస్తుంది.
బీపీ పెరిగినప్పుడు ఎక్కువగా చెమట పడుతుంది. దీంతో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీని కారణంగా అధికంగా దాహం వేస్తుంది. దీంతె రాత్రిపూట నిద్రభంగం జరుగుతుంది. మీరు ఈ సమస్యని ఎదుర్కొన్నట్లయితే ఒక్కసారి బీపీ చెక్‌ చేసుకోవడం మంచిది.

డీ హైడ్రేషన్‌ రాత్రిపూట దాహంగా అనిపించడం డీహైడ్రేషన్ సమస్యకి కారణం అవుతుంది. డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీరు లేకపోవడం. దీని కోసం క్రమం తప్పకుండా నీరు తాగడం అవసరం. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని గుర్తుంచుకోండి. డైట్‌లో మార్పులు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే వ్యాయామ దినచర్యను పాటించాలి. అలాగే రోజువారీన డైట్‌లో మార్పులు చేయాలి.

ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు ఆహారంలో చేర్చుకోవాలి. ట్రాన్స్ ఫ్యాట్, సంతృప్త కొవ్వును మితంగా తీసుకోవాలి. సరైన జీవనశైలి బిపిని నియంత్రించడానికి సరైన జీవనశైలిని మెయింటెన్‌ చేయాలి. ఇందుకోసం ఆహారంలో సోడియం తక్కువగా తీసుకుని, ఊబకాయం రాకుండా చూసుకోవాలి. ఆల్కహాల్ తీసుకుంటే వెంటనే దానిని తగ్గించండి. ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు బీపీ చెక్‌ చేసుకోండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker