Health

చెవిలో ఒక్క చుక్క వేస్తే గులిమి మొత్తం బయటకు వచేస్తుంది.

చెవి లోపల ఉన్న నూనూగు వెంట్రుకలు దుమ్మును లోపలికి చేరకుండా అడ్డుకుంటాయి. మిగిలిన దుమ్ము గుబిలికి అంటుకుంటుంది. అసలు గుబిలి అనేది చెవిలో సహజంగా గ్రంధుల నుండి ఉత్పత్తయ్యే ఒక ద్రావణం. దానికి చర్మ మృతకణాలు,దుమ్ము కలిసి ఘనీభవిస్తుంది. అయితే చెవుల్లో గులిమి పేరుకుపోవ‌డం అన్న‌ది స‌ర్వ సాధార‌ణంగా జ‌రిగే విష‌య‌మే. నిజానికి గులిమి అనేది మన చెవి నుంచి సహజంగా వెలువడే మలిన పదార్థం. గులిమి తీసుకుంటూ చెవులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. మనలో చాలామంది అగ్గిపుల్లలకు దూది చుట్టి, పిన్నీసులు పెట్టి గులిమి తీసుకుంటూ ఉంటారు.

ఈ పద్ధతుల వల్ల కొన్ని సందర్భాల్లో చెవుల్లోని సున్నిత మైన ప్రదేశాలకు ముప్పువాటిల్లే అవకాశం ఉంటుంది. చాలా మందిలో గులిమి ఎక్కువ‌గా త‌యారై ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే చెవుల్లో మాటిమాటికీ దుర‌ద‌గా అనిపిస్తుంటుంది. అయితే అలాంటి వారు కాట‌న్ బ‌డ్స్ తో గులిమి తీస్తుంటారు. గులిమి చెవి లోపలి గ్రంథుల్లో ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. చెవులను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. చెవుల్లో ఉన్న నాళాలు ఎండిపోకుండా, పగుళ్లు రాకుండా కాపాడుతుంది.

ధూళికణాలు, నీరు చెవిలోపలికి పోకుండా రక్షిస్తుంది. ఎలాంటి వ్యాధులూ సోకకుండా అరికడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు గుమిలిలో ఉంటాయి. మనం మాట్లాడుతున్నప్పుడు లేదా నములుతున్నప్పుడు దవడలు కదులుతాయి కదా, ఈ దవడల కదలికల వలన చెవి లోపల ఉన్న గులిమి మెల్లిమెల్లిగా కదులుతూ చెవి రంధ్రం ద్వారం బయటకు వచ్చేస్తుంది. గులిమి బాగా ఎక్కువైతే, చెవులకు అవరోధంగా మారుతుంది. చెవి నొప్పి, వినికిడి తగ్గిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. చిటికెన వేలు చెవి లోపలికి దూర్చి గులిమి తీసుకుంటూ ఉంటారు.

ఇది మంచి పద్ధతి కాదు. దీనివలన అనేక సమస్యలు వస్తాయి. అయితే దూదితో శుభ్రం చేసుకోవడం ఇంకా ప్రమాదకరం. కానీ వాటికి బ‌దులుగా కింద తెలిపిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌వ‌చ్చు. దీంతో గులిమిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీయ‌వ‌చ్చు. ఒక చిన్న గ్లాస్‌లో 60 ఎంఎల్ మోతాదులో గోరు వెచ్చ‌ని నీటిని తీసుకోవాలి. అందులో అర టీస్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత డ్రాప‌ర్ స‌హాయంతో ఒక్కో చెవిలో 5 నుంచి 10 చుక్క‌లు ఆ మిశ్ర‌మాన్ని వేయాలి.

అనంత‌రం ఒక గంట సేపు అయ్యాక శుభ్ర‌మైన నీళ్ల‌తో చెవుల‌ను క‌డిగేయాలి. ఇలా 2 రోజుల‌కు ఒక‌సారి చేయాలి. చెవి మొత్తం శుభ్రం అయిందని అనుకునే వ‌ర‌కు 2 రోజుల‌కు ఒక‌సారి ఇలా చేయ‌వ‌చ్చు. అయితే 4 సార్లు ఈ విధంగా ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. అంత‌క‌న్నా ఎక్కువ సార్లు ఈ చిట్కాను ట్రై చేయ‌కూడ‌దు. అవ‌స‌రం అనుకుంటే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker