ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా..? ఈ విషయం తెలిస్తే చూడమన్న చూడరు.
ఉదయం లేచిన దగ్గర్నుంచి. అర్థరాత్రి వరకు గంటల తరబడి ఫోన్లో మునిగిపోతున్నారు. ఇక సోషల్ మీడియా ప్రపంచం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం లేవగానే. టైం చూసుకోవడంతో మొదలు. ఈమెయిల్ చెకింగ్స్, వాట్సాప్ మేసేజ్లు చెక్ చేసుకోవడం. ఇలా ఒక్కటేమిటీ కనీసం అర్థ గంటపాటు ఫోన్లో గడిపేస్తారు. ఇక కొందరికి ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా అస్సలు ఉండలేరు.
అయితే ఈ ఆధునిక కాలంలో టెక్నాలజీతో పాటు జీవితం కూడా చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. సమయానికి అన్నం తినడం, నిద్రపోవటం వంటివి కూడా సరిగా పాటించడం లేదు.. ఉద్యోగుల కైతే రాత్రులు కూడా నైట్ షిఫ్ట్ లంటూ పని ఉంటుంది. ఇలా చేయడం వలన అనేక అనారోగ్యాలు సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిలో భాగంగానే కంటి సమస్యలు చిన్న వయసు వారికి కూడా ఎక్కువగా వస్తున్నాయి.
దీనికి ప్రధాన కారణం ఉదయం నిద్ర లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లు, టీవీలు, ల్యాప్ టాప్స్ వంటి ఎలక్ట్రికల్ పరికరాలు ఎక్కువగా ఉపయోగించడం వలన. ఉదయం లేవగానే మొబైల్ చూస్తున్నారా. ఎంత ప్రమాదమో తెలుసుకోండి. ఉదయం లేవగానే ఫోన్ చూడటం వలన ఆ స్క్రీన్ లైట్ పూర్తిగా కళ్లపై పడుతుంది. ఇలా పడటం వలన కంటి రెటీనా దెబ్బతిని చిన్న వయసులోనే కంటి చూపు కోల్పోవడం జరుగుతుంది.
రాత్రి కూడా నిద్రపోయే ముందు ఫోన్లను యూస్ చేయడం వలన త్వరగా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.. సరిగా నిద్రలేక పోవడం వలన గ్యాస్ట్రిక్, అజీర్తి సమస్యలను వస్తాయి. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి… డయాబెటిస్, గుండెపోటు, రక్తపోటు వంటి ప్రాణాంతకరమైన వ్యాధులు వ్యాపిస్తాయి. మొబైల్ చూడడం అలవాటు ఉంటే ఆ తర్వాత యోగా, మెడిటేషన్ వంటివి ఎన్ని ఎక్సర్సైజులు చేసినా కూడా కంటినొప్పి తొందరగా కనిపించడం వంటి సమస్యలు తొందరగా తొలగిపోవు.
అయితే కళ్ళు మసక మసక కూడా కనిపిస్తూ ఉంటాయి. భవిష్యత్తులో ఇది చాలా అనర్థాలకు కూడా దారి తీయవచ్చు. వయసు మీద పడే కొద్ది కళ్ళు కనిపించకపోవడం అనేది సాధారణమైన సమస్య కానీ ఇలా ఫోన్లో అధికంగా అవసరం లేకపోయినా ఎక్కువగా వినియోగించడం వలన ఈ కంటి సమస్యలు తలెత్తుతున్నాయి అందువలన సాధ్యమైనంత వరకు నిద్ర లేవగానే నిద్రపోయే ముందు ఫోన్లను వాడకుండా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.