ప్రతి రోజు 3 తులసి ఆకులు తింటే ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు.
తులసిలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయని అంటే ఆశ్చర్యం వేస్తుంది కదూ.. ముఖ్యంగా కఫం పడుతున్న వ్యాధులపై తులసి అద్భుతంగా పనిచేస్తుంది. రక్తంతో కూడిన దగ్గు, కఫం పడుతున్నప్పుడు తులసి ఆకులు నాలుగు చొప్పున ప్రతి గంటగంటకూ తింటే దగ్గు, ఇతర సమస్యలు తగ్గుముఖం పడతాయి. కడుపులోని క్రిములను పారదోలే శక్తి తులసికి ఉంది. తులసిని వాడితే క్రిములు తొలగడమే కాక రక్తహీనత కూడా నివారించబడుతుంది.
జీర్ణ శక్తికి తులసి చాలా మంచి మందు. తులసి ఆకులు నాలుగు, మిరియాలు రెండు వేసి మెత్తగా నూరి చిన్న మాత్రగా చేసుకుని భోజనానికి అరగంట ముందుగా వేసుకుంటే బాగా ఆకలి వేస్తుంది. తిన్నది కూడా జీర్ణమవుతుంది. అయితే తులసి చెట్టును హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రంగా కలుస్తారు ఆధ్యాత్మికంగానే కాకుండా ఔషధ గుణాలు ఉన్న తులసి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
తులసి ఆకులను రోజు సేవించటం వలన జలుబు దగ్గు నుండి ఉపశమనం పొందటమే కాకుండా జీర్ణ సమస్యలను కూడా జయించవచ్చు. వర్షాకాలం లో చాలామందికి జలుబు గొంతు నొప్పితో జ్వరాలతో బాధపడుతుంటారు. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే తులసి నీటిని స్వాగతం అలవాటు చేసుకోవాలి. వేడివేడిగా ఏదైనా తాగాలి అనిపిస్తే తులసీ నీళ్ళ ను వేడి చేసుకుని తాగాలని ఆయుర్వేద డాక్టర్లు చెప్తున్నారు.
తులసి ఆకులను రోజు నమ్మితే దంతాలు చిగుళ్ళు బలంగా మారుతాయి తులసి ఆకులు శరీర బరువును తగ్గిస్తాయి శరీరంలో కొవ్వు పదార్థాలు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. వీటి ఆకులను నీటిలో మరిగించి చిటికెడు పసుపు పరగడుపున తాగితే శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. ఎక్కువగా కడుపునొప్పితో బాధపడేవారు తులసి ఆకులను నీటిలో మరిగించి నిమ్మరసం కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది.
సిజనల్ ఇన్ఫెక్షన్స్ గొంతు నొప్పి జ్వరంతో బాధపడేవారు తులసి ఆటలను పిలిచే ఉపశమనం లభిస్తుంది. చాలామందికి నోటి దుర్వాసన సమస్య వేధిస్తూ ఉంటుంది ఈ సమస్య ఉన్నవాళ్లు ప్రతిరోజు రాత్రి నీళ్లలో తులసి ఆకులను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటితో పళ్ళు తోముకోవాలి. ఇలా చేయడం వలన దంత సమస్యలు పోయి. చిగురులు బలంగా తయారవుతాయి.