ఆశిష్ విద్యార్ది రెండో పెళ్లి గురించి తెలిసి మొదటి భార్య ఏం చేసిందో తెలుసా..?
నటుడు ఆశిష్ విద్యార్ధి..ఈ రోజు అస్సామ్కు చెందిన రూపాలి బారువాను కోల్కతాలోని ఓ క్లబ్లో వివాహా మాడారు. ఆశిష్ విద్యార్ధి విషయానికొస్తే.. ‘కాల్ సంధ్య’ సినిమాతో నటుడిగా పరిచయ్యారు. ఆ తర్వాత గోవింద్ నిహ్లానీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ద్రోహ్ కాల్’ సినిమాలో నటనకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు.
అయితే ఆయన రెండో వివాహంపై అందరితో పాటు అశిష్ విద్యార్ధి మొదటి భార్య స్పందించారు. భర్త రెండో పెళ్లి చేసుకున్న 17గంటల తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లు పెట్టారు. అశిష్ విద్యార్ధికి మొదటి వివాహం నటి శకుంతల బారువా కుమార్తె, సింగర్ రాజ్ షీ బారువాతో జరిగింది. వీరిద్దరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు.
కొడుకు అర్థ విద్యార్థి, కూతురు,అల్లుడు ఉన్నారు. అయితే ఈనెల 25వ తేది జమైషష్టి సందంర్భంగా బెంగాలీ సంప్రదాయం ప్రకారం అల్లుడిని ఇంటికి పిలిచి ఇష్టమైన వంటకాలతో భోజనం పెడతారు. అందులో భాగంగానే అశిష్ విద్యార్ధి మొదటి భార్య రాజోషి బారువా అల్లుడి పేరును అడ్డుపెట్టుకొని భర్త చేసిన పనిపై చింతిస్తూ ఓ నిగూఢార్ధం వచ్చేలా పోస్ట్ పెట్టింది.
మీరు చాలా మంచి వారు. మీరు ఏం చేసినా నేను మిమ్మల్ని ప్రశ్నించను. మీరు బాధ కలిగించే పని చేయరు. అది మాత్రం గుర్తుంచుకోండి. అని ఒక పోస్ట్ పెట్టిన రాజ్జీ బారువా కొద్దిసేపటికే… మీ మనసులో చింతలు, సమస్యలు, సందేహాలు తొలగించండి. వీటన్నింటి తర్వాత మీకు ప్రతిదీ స్పష్టంగా అర్దమవుతుంది.
అప్పుడు మీ జీవితంలో శాంతి మిగులుతుంది. చాలా కాలంగా మీరు సమస్యలతో పోరాడుతున్నారు. మీకు అంతా మంచి జరగాలి..కాని ‘జీవితపు చిక్కుల్లో చిక్కుకోవద్దు’ అంటూ నవ్వుతున్న ఫోటోని పిలు విద్యార్ది పేరుతో ఉన్న ఇన్స్టా హ్యండిల్లో కామెంట్ పోస్ట్ చేసింది అశిష్ విద్యర్ధి మొదటి భార్య రాజ్షీ బారువా.