బ్లాక్ రైస్ తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే..!జీవితంలో ఎప్పటికీ వదిలిపెట్టారు.
గత రెండు మూడేళ్ల నుంచే దేశ వ్యాప్తంగా రైతులు బ్లాక్ రైస్‌ను పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల బ్లాక్ రైస్‌ను పండిస్తున్నారు. కాకపోతే.. చాలా తక్కువ ఎకరాల్లో ఈ పంటను ప్రస్తుతం పండిస్తున్నారు. అయితే.. కొన్ని కిరాణా, బియ్యం కొట్టుల్లో బ్లాక్ రైస్‌ను అమ్ముతున్నారు. కాకపోతే సాధారణ బియ్యం కన్నా.. బ్లాక్ రైస్ ధర మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే సాధారణంగా మనం ఎక్కువగా వైట్ రైస్ ని తీసుకుంటూ ఉంటాం. ఇక వైట్ రైస్ తో పాటు చాలామంది బ్రౌన్ రైస్ ని కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటారు.
కానీ ఎక్కువ శాతం మంది వైట్ రైస్ ని తింటూ ఉంటారని చెప్పవచ్చు. ఈ వైట్ రైస్ ని ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వైట్ రైస్,బ్రౌన్ రైస్ రెడ్ రైస్ తో పాటు బ్లాక్ రైస్ కూడా ఉంటుంది అన్న విషయం చాలామందికి తెలియదు. అదేంటి బ్లాక్ రైసా అంటుకుంటున్నారా బ్లాక్ రైస్ కూడా వైట్ రైస్ మాదిరిగానే బ్లాక్ గా కనిపిస్తాయి.
అయితే ఈ బ్లాక్ రైస్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు.. మరి ప్రతిరోజు బ్లాక్ రైస్ తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బ్లాక్ రైస్ అంటే నల్ల బియ్యం. చాలామంది వీటిని నిషేధిత బియ్యంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది వరకు రోజుల్లో ఈ బియ్యాన్ని బాగా ఉన్నతమైన వాళ్ళ కోసమే పండించేవారట అందుకే ఈ బియ్యం అందరికి అందుబాటులో ఉండేవి కాదు. కానీ ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది.
ఈ బియ్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నాయి. వీటిని ఎక్కువగా ఈశాన్యం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా పండిస్తుంటారు. ఈ బ్లాక్ రైస్ ని మన డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె పనితీరు బాగుంటుంది. కొలెస్ట్రాల్ తాగిన తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ బారిన పడకుండా బ్లాక్ రైస్ సహాయపడుతుంది. బ్లాక్ రైస్ శరీరంలోని చక్కర స్థాయిలను సమతుల్యంగా ఉంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నెమ్మది చేసి డయాబెటిస్ రాకుండా వచ్చిన దాన్ని పెరగకుండా కాపాడుతుంది.
అలాగే మలబద్ధకం, విరేచనాలను తగ్గించి ప్రోటీన్, ఫైబర్ లను అందించి బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. బ్లాక్ రైస్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయంలో కొవ్వు పేరుకోకుండా కాపాడి కాలేయ పనితీరును మెరుగు పరుస్తుంది. ఇలా బ్లాక్ రైస్ మీ ఆరోగ్యాన్ని కాపాడడంతో తన వంతుపాత్ర పోషిస్తుంది.