Health

వేస‌విలో శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచే చద్దన్నం, ఇలా త‌యారు చేస్తే ఆరోగ్య‌క‌రం.

పనులకు వెళ్లేవాళ్లకు అదే బ్రేక్ ఫాస్ట్. చద్దన్నంలో కాసిన్ని మజ్జిగ వేసుకుని.. ఒక పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ ఉంటే ఇంక అంతకు మించిన టేస్టీ, బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఉండదనే చెప్పాలి. ఎందుకంటే చద్ది అన్నంలో శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. రోజూ కాకపోయినా.. రాత్రి అన్నం మిగిలినప్పుడు డస్ట్ బిన్‌లో పడేయకుండా.. తెల్లారి చద్దన్నం తింటే ఎంతో ఉపయుక్తం అని పెద్దవాళ్లు చెబుతారు.

చద్ది అన్నంలో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్లు దాదాపుగా 15 రెట్లు అధికంగా ఉంటాయి. ఎండాకాలంలో పొద్దున్నే చల్ల పోసుకుని చద్దన్నం తినడం వల్ల చలువ చేస్తుంది. చద్దన్నం తింటే మంచిదే.. కానీ ఎక్కువసేపు ఉంచకూడదు. ఉదయన్నే తినేయాలి. అయితే చాలామంది యువత చద్దన్నం ని ఏదో పూర్ వాళ్లు అనగా సరిగ్గా తిండి దొరకని వారు అటువంటి ఫుడ్ ని తీసుకుంటూ ఉంటారు అని భావిస్తూ ఉంటారు. కానీ చద్దన్నం వల్ల కలిగే లాభాలు తెలిస్తే తినకుండా అసలు ఉండలేరు.

మరి చద్దన్నం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మరి చద్దన్నం ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయానికొస్తే.. రాత్రి సమయంలో మిగిలిపోయిన ఆహారంలో కాస్త మజ్జిగతో పాటు కొంచెం పాలు కలిపి అందులో పచ్చిమిర్చి ఎర్రగడ్డ కలిపి పెట్టుకుని రాత్రంతా అలాగే ఉన్న తర్వాత ఉదయాన్నే దాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బక్క పలుచగా ఉన్నవారు ఈ చద్దన్నం తినడం వల్ల ఒళ్ళు పెట్టడంతో పాటు బలంగా తయారవుతారు.

అలాగే లావుగా ఉన్నవారు కూడా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. చద్దన్నం తింటే శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. దానివల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారతాయి. వేసవికాలంలో చద్దన్నం తింటే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. వడదెబ్బ తగలకుండా రక్షణ కల్పిస్తుంది. ఎండ వల్ల కలిగే నీరసాన్ని కూడా నివారిస్తుంది. అలాగే ఉదయాన్నే చద్దన్నం తింటే రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు దరిచేరవు. అల్సర్లు, పేగు సంబంధ సమస్యలు ఉన్నవారికి చద్దన్నం చక్కటి ఔషధంలా పనిచేస్తుంది.

పనిచేస్తుంది. చద్దన్నం రెగ్యులర్‌గా తింటే అన్ని అవయవాలకు బలం కలుగుతుంది. చద్దన్నంలో ఉండే బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పూర్వం రోజుల్లో ఈ చద్దన్నం తీసుకోవడం వల్లే వారు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా బలంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఎక్కువ రోజులు జీవించేవారు. ప్రస్తుత కాలంలో మాత్రం మనం తింటున్న వాటిలో దాదాపు 70 శాతం అన్నీ కూడా కల్తీ అయినవే అని చెప్పవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker