వారానికి ఈ జ్యూస్ ఒక్కటి తాగితే చాలు మీ కండరాలు, నరాలు బలంగా మారుతాయి.
ఫ్రెష్ దానిమ్మ జ్యూస్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ శరీరంలో జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. కేలరీలను వేగంగా, సులభంగా బర్న్ చేయడంలో సహాయపడతాయి. ఇవి మీ పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీవక్రియ రేటును కూడా పెంచుతాయి. ఇవి మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు.. మీరు యవ్వనంగా ఉండటానికి తోడ్పడతాయి. అయితే దానిమ్మ పండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం మన అందరికి తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఈ దానిమ్మ పండు ఇష్టంగా తింటూ ఉంటారు. దానిమ్మ పండు వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
దానిమ్మ పండులో ఐరన్ తో పాటు అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దానిమ్మ రసంలో విటమిన్ సి, ఇ, కె, మెగ్నీషియం వంటి ఎన్నో ఆరోగ్యకరమైన ఖనిజాలు ఉన్నాయి. ఇది ఆరోగ్య పరంగా అనేక విధాలుగా మేలు చేస్తుంది. దానిమ్మలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ నరాలు, కండరాలు సమర్థవంతంగా పని చేసేలా చేస్తాయి. దానిమ్మ పండులో ఎల్లాగిటానిన్స్ అనే పాలీఫెనాల్స్ ఉంటాయి.
ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. అంతేకాకుండా నరాలకు బలాన్ని ఇస్తాయి. ఇందులోని మెగ్నీషియం నరాలు, కండరాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దానిమ్మ శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గించి కండరాల బలాన్ని పెంచుతుంది. దాంతో పాటు ఇందులో ఉండే ఐరన్ శరీరంలో రక్తహీనతను తొలగిస్తుంది.
కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. రోజుకు కనీసం ఒక్కసారైనా దానిమ్మ రసం తాగాలి. దానిమ్మ గింజలు తింటే ఒత్తిడి, చిరాకు తగ్గి మానసికోల్లాసం కలుగుతుంది. దానిమ్మ గింజలు తినడం వల్ల చిగుళ్లు గట్టిపడటం, నోరు, గొంతులోని పుండ్లు నయమవుతాయి. దానిమ్మ గర్భవతులకు కలిగే వేవిళ్లను, రక్త క్షీణతను నివారిస్తుంది.