పాములు నిజంగా పగ పెంచుకొని కాటు వేస్తాయా..! అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాముల్లో 15శాతం మాత్రమే విషపూరితమైనవి. దేశంలో 5జాతుల పాములు విషపూరితమైనవిగా గుర్తించారు. ఇవి కాటేస్తే మూడు గంటల్లో మరణించే అవకాశం ఉంది. ఈలోపే బాధితుడికి వైద్యం అందించి, కాపాడాలి. కాటేసిన పాము విషపూరితమైందా, కాదా అనేది కాటును బట్టి గుర్తించవచ్చు. విషసర్పమా, కాదా అనేది నిర్ధారించుకున్న తర్వాత తగు జాగ్రత్తలతో బాధితుడిని వైద్యానికి తరలించాలి. విషసర్పం కాటేస్తే శరీరంపై రెండు గాట్లు పడతాయి.
విషంలేని పాము కరిచిన చోట మూడు కంటే ఎక్కువ గాట్లు ఉంటాయి. అయితే సాధారణంగా పాము అంటే చాలు ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు.. ఈ కేవలం కొంతమంది మాత్రమే పాములను ధైర్యంగా పట్టుకోగలుగుతూ ఉంటారు. ఇంకొందరు పాములు కనిపించాయి అంతే చాలు వాటి వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది అని ముందుగానే వాటిని చంపేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాటికి దెబ్బ పడగానే అవి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటాయి.
చాలా తక్కువ సందర్భాలలో అలా తప్పించుకుని వెళ్తాయని చెప్పవచ్చు. పాములు చంపే ముందు జాగ్రత్తగా చంపాలి లేదంటే అవి పగపడతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ చాలామంది పాములు పగబట్టడం ఏంటి అని లైట్ తీసుకుంటూ ఉంటారు. మరి నిజంగానే పాములు పగపడతాయా? ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసు.. నిజానికి పాముకు మెమొరీ ఉండదు.
కాబట్టి అలాంటప్పుడు పాము మనల్ని గుర్తుపెట్టుకునే అవకాశం పగబట్టే అవకాశం కాటేవేసే అవకాశాలు ఉండవు. అయితే ఇదంతా మనవాళ్లు ఎవరికి వారుగా కల్పించుకున్న ఒక అపోహ మాత్రమే. అయితే ఇందుకు ఒక కారణం కూడా ఉంది అంటున్నారు. అదేమిటంటే అప్పట్లో రైతుల ప్రధాన వృత్తి వ్యవసాయం. కానీ ఆ రైతుల పండించిన పంతులను ఎక్కువగా ఎలుకలు తినేసి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలిచేవి.
దానికి తోడు పొలం చుట్టూ కనిపించిన పాములు అన్నీ కూడా చంపడంతో పొలంలో ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయేది. దాంతో పంటలకు నష్టం ఇంకా ఎక్కువగా కలిగేది. అలా ఆ సమయంలో పాములను చంపవద్దని ఒకవేళ చంపే సమయంలో దెబ్బపడి తప్పించుకుని వెళ్ళిపోతే అవి పగబడతాయి అన్న భయాన్ని ప్రజలలో క్రియేట్ చేశారట.