News

ఇండస్ట్రీలో విషాదం. హోటల్ గదిలో ప్రముఖ నటుడు మృతి.

ముంబైలోని ఇగత్ పురిలో ఉన్న ఓ హోటల్ గదిలో నితేష్ పాండే కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ కి గురైన ఆయన.. ఆసుపత్రికి తరలించే లోపే ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలిసింది. షూటింగ్‌లో నిమిత్తం వెళ్లిన ఆయన అక్కడ హోటల్‌ రూమ్‌లో గుండెపోటుకు గురైనట్లు పోలీసులు ప్రాథమిక సమాచారం ఇచ్చారు. ఈ మరణానికి సంబంధించి దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.

నితేష్ మరణవార్త తెలిసి పలువురు వెండితెర, బుల్లితెర నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రముఖ బాలీవుడ్ నటుడు నితీష్ పాండే ముంబైలోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించారు. 51 ఏండ్ల నితీష్ ఇగత్ పురిలోని ఓ హోటల్లో ఆయన చనిపోయిన కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. గుండెపోటుతోనే ఆయన మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. నితీష్ పాండే ఉత్తరాఖండ్ లోని అల్మోరా కుమావోన్ లో జన్మించారు.

గత 25 సంవత్సరాలుగా ఆయన నటనా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నో సీరియల్స్‌, టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ అద్భుతంగా నటించి మెప్పించారు. ‘ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా’, ‘ఇండియావాలి మా’, ‘ఏక్ రిష్తా సాజెదారీ కా’ సహా పలు టీవీ సిరీస్‌లు, ‘ఏక్ ప్రేమ్ కహానీ’, ‘సాయా’, ‘జస్టజూ’, ‘దుర్గేష్ నందిని’ లాంటి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

పలు సినిమాల్లోనూ ఆయన నటించి ఆకట్టుకున్నారు. ’ఓం శాంతి ఓం’,’దబాంగ్ 2′, ‘ఖోస్లా కా ఘోస్లా’, ‘మదారి’, ‘బదాయి దో’, ‘షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్’ లాంటి హిట్ సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. ‘ఖోస్లా కా ఘోస్లా’లో నితీష్ పాండే నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నితీష్ పాండే చివరిసారిగా ‘అనుపమ’, ‘ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా’లో కనిపించారు.నితీష్ పాండే నటుడిగానే కాకుండా నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు.

డ్రీమ్ కాజిల్ ప్రొడక్షన్స్ పేరుతో స్వతంత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి అద్భుతంగా నడిపించారు. ఎన్నో చక్కటి సినిమాలను నిర్మించారు. నితీష్ పాండే అశ్విని కల్సేకర్‌ను అయన వివాహం చేసుకున్నాడు. 2002లో ఈ ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ‘జస్టజూ’అనే టీవీ షోలో పరిచయమైన నటి అర్పితా పాండేని నితీష్ 2003లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఉంటున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker